ఏ ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్

By Ravi

బ్రిటన్ యొక్క ఒరిజినల్ ఆటోమోటివ్ ఫ్యాషన్ హౌస్ అయిన 'ఏ ఖాన్ డిజైన్' (A Kahn Design) సీఈఓ, డిజైన్ డైరెక్టర్ ఆఫ్జల్ ఖాన్ 'లాగ్ జెన్‌సెన్' (Lauge Jensen) కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించారు. లండన్‌లోని చెల్‌సీ, కింగ్స్ రోడ్ వద్ద ఉన్న ఎ. ఖాన్ డిజైన్ బొటిక్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అరుదైన మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించారు.

ఇదొక హ్యాండ్ బిల్ట్ (చేతుల్తో తయారు చేసిన) కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్. కస్టమర్ల ఆర్డర్ల మేరకు వీటిని తయారు చేస్తారు. ఈ సీటులోని ప్రతి అంశం కూడా ఓ ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటుంది. అందమైన డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్‌ల కలయికతో దీనిని తయారు చేశారు.

ఏ ఖాన్ డిజైన్ నుంచి లభ్యం కానున్న ఈ కస్టమైజ్డ్ లాగ్ జెన్‌సెన్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

హ్యాండ్ ట్రిమ్డ్ రేసింగ్ సీట్స్, డ్రిల్డ్ పెడల్స్, కస్టమ్ డైల్స్ అండ్ ఇండికేటర్స్, షార్ట్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎగ్జాస్ట్ టిప్స్, విజువల్లీ డ్రమాటిక్ హ్యాండిల్ బార్స్, ఫ్రంట్ ఫోర్క్స్ అన్నీ కూడా విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి.

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

ఈ కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్ కేవలం 4 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 160 మైళ్లు).

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

ఇందులో ఉపయోగించిన ఇంజన్ కూడా చేతుల్తోనే తయారు చేయబడినది. ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత సమర్థవంతమైన వి2-ఇంజన్ అని డిజైన్ హౌస్ పేర్కొంది.

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

ప్రపంచంలో కెల్లా యూరో4 నిబంధనలను పాటించే ఏకైక ఇంజన్ తమదేనని, ఈ ఇంజన్ అతి తక్కువ మోతాదులో కర్భన ఉద్ఘారాలను విడుదల చేస్తుంది.

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

ఈ కస్టమైజ్డ్ బైక్‌ను కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు మాత్రమే తయారు చేస్తారు. వినియోగదారులు కోరుకుంటే తమకు నచ్చిన విధంగా ఈ బైక్‌ను మార్చుకోవచ్చు.

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

ఏ ఖాన్ డిజైన్ కస్టమైజ్ చేసిన ఈ మోటార్‌సైకిల్‌లో హ్యాండ్ ట్రిమ్డ్ రేసింగ్ సీట్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

ఏ ఖాన్ డిజైన్ కస్టమైజ్ చేసిన ఈ మోటార్‌సైకిల్‌లో లాగ్ జెన్‌సెన్ బ్యాడ్జింగ్‌ను చూడొచ్చు.

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

ఏ ఖాన్ డిజైన్ కస్టమైజ్ చేసిన ఈ మోటార్‌సైకిల్‌లో సన్నగా ఉండే ఎల్ఈడి రియర్ టెయిల్ ల్యాంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఖాన్ డిజైన్ నుంచి కస్టమైజ్డ్ కెఫే రేసర్

ఏ ఖాన్ డిజైన్ కస్టమైజ్ చేసిన ఈ మోటార్‌సైకిల్‌.

More from DriveSpark

Article Published On: Tuesday, April 8, 2014, 11:47 [IST]
English summary
Afzal Kahn, CEO and Design Director of A Kahn Design, Britain's original automotive fashion house, has unveiled the Lauge Jensen - A. Kahn Design café racer. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+