అగ్ని మోటార్స్ నుంచి 'మినీ అగ్ని జెడ్' ఎలక్ట్రిక్ బైక్

By Ravi

గుజరాత్‌కు చెందిన హై ఎఫీషియెన్సీ డి.సి. మోటార్ల తయారీ కంపెనీ 'అగ్ని మోటార్స్' గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో సరికొత్త మినీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది. అగ్ని మోటార్స్ తయారు చేసిన ఈ బుల్లి ఎలక్ట్రిక్ బైక్ పేరు 'మినీ అగ్ని జెడ్' (Mini Agni Z).

ఐదేళ్లకు పైబడి వయస్సు కలిగిన చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఈ మినీ అగ్ని జెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేశారు. అయితే, ఇతర చిల్డ్రన్ ఎలక్ట్రిక్ బైక్స్ మాదిరిగా ఇది కేవలం చిన్న పిల్లలకే పరిమితం కాకుండా, పెద్దవాళ్లు (అడల్ట్స్) సైతం దీనిని నడిపేందుకు వీలుడా డిజైన్ చేశామని కంపెనీ పేర్కొంది.


మినీ అగ్ని జెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 15 హార్స్ పవర్ అగ్ని మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్ 36వోల్ట్స్ లీడ్-యాసిడ్ బ్యాటరీస్‌తో పనిచేస్తుంది (ప్రొడక్షన్ వెర్షన్‌లో హై కెపాసిటీ కలిగిన లిథియం పాలిమర్ బ్యాటరీలను ఉపయోగించనున్నారు). ఇందులో 95ఆర్ మోడల్ డైరెక్ట్ చైన్ డ్రైవ్ మరియు అగ్ని టార్క్ కంట్రోలర్లతో లభిస్తుంది.

మినీ అగ్ని జెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 110 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. సింగిల్ చార్జ్‌తో దీనిపై 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. చిన్న పిల్లల భద్రత దష్ట్యా, తల్లిదండ్రులు ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్పీడ్ మరియు యాక్సిలరేషన్ స్థాయిలను తగ్గించుకునే వీలుంటుంది.

Agni Motors Unveiled Mini Agni Z Electric Bike

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రేసింగ్ సర్క్యూట్‌లో అగ్ని మోటార్స్ యొక్క రేసింగ్ బృందం 'అగ్ని రేసింగ్' అగ్రగామిగా నిలుస్తూ వస్తోంది. ఇలా వారు విజయం సాధించిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల నుంచి స్ఫూర్తి పొంది, ఈ సరికొత్త మినీ అగ్ని జెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేశారు. కాగా.. ఈ బైక్ విడుదల, లభ్యత మరియు ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

More from DriveSpark

Article Published On: Friday, February 7, 2014, 9:07 [IST]
English summary
Agni Motors, a manufacturer of high efficiency D.C. motors in Gujarat, has showcased its mini electric motorcycle the “Mini Agni Z” at the Auto Expo 2014. This is an electrically driven, sporty looking mini motorcycle developed for children aged about 5 upwards that can also be ridden by adults.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+