ఏరియల్ మోటార్స్ నుంచి ఏరియల్ ఏస్ బైక్

By Ravi

ఏరియల్ ఆటమ్ (Ariel Atom) వంటి ఫాస్టెస్ట్ కార్లను తయారు చేసే బ్రిటీష్ కార్ కంపెనీ ఏరియల్ మోటార్స్ (Ariel Motors) దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా తిరిగి ఓ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది. ఈ లగ్జరీ మోటార్‌సైకిల్ పేరు 'ఏరియల్ ఏస్' (Ariel Ace).

ఏరియల్ మోటార్స్ దాదాపు 50 ఏళ్ల క్రితం మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత ఈ సంస్థ నుంచి వచ్చిన మోటార్‌సైకిల్ ఇది. ఈ బైక్‌లో జపనీస్ బైక్ మేకర్ హోండా నుంచి గ్రహించిన పవర్‌ఫుల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఏరియల్ ఏస్ బైక్

తర్వాతి స్లైడ్‌లలో ఏరియల్ ఏస్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని పరిశీలించండి.

ఏరియల్ ఏస్ బైక్

హోండా నుంచి గ్రహించిన 1237సీసీ, వి4 కాన్ఫిగర్డ్ ఇంజన్ (హోండా విఎఫ్ఆప్1200ఎఫ్ బైక్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు) గరిష్టంగా 128.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో డ్యూయెల్ క్లచ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు.

ఏరియల్ ఏస్ బైక్

ఏరియల్ మోటార్స్ అందించనున్న ఏస్ మోటార్‌సైకిళ్లను కస్టమర్ల కోరిక మేరకు అనుగుణంగా కస్టమైజ్ చేసిస్తారు. బరువును తగ్గించి, రిగిడిటీనీ మెయింటైన్ చేసేందుకు గాను ఏరియల్ ఏస్ మోటార్‌సైకిల్ తయారీలో ఆల్యూమినియం ట్రెల్లిస్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు.

ఏరియల్ ఏస్ బైక్

ఈ ఫ్రేమ్ స్ట్రక్చర్ పెయింట్‌ను కస్టమర్ల ఎంపిక మేరకు తమ నచ్చిన రంగులో పెయింట్ చేయించుకోవచ్చు. కేవలం ఇదే కాకుండా సీట్, హ్యాండిల్ బార్స్, ట్యాంక్, ఫెండర్స్, బాడీ వర్క్ ఇలా అనేక అంశాలను కస్టమర్ల తమకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేయించుకోవచ్చు.

ఏరియల్ ఏస్ బైక్

ఏరియల్ మోటార్స్ ఈ బైక్‌లో ముందు వైపు యూఎస్‌డి ఓహ్లిస్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, కస్టమర్లు కోరుకుంటే దీనిని టిటిఎక్స్ వెర్షన్‌కు అప్‌‌గ్రేడ్ చేసుకోవచ్చు. వెనుక వైపు కూడా ఓహ్లిస్ నుంచి గ్రహించిన మోనోషాక్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు.

ఏరియల్ ఏస్ బైక్

ఏరియల్ మోటార్స్ తమ ఏస్ మోటార్‌సైకిల్ ధర విషయంలో కానీ లేదా లభ్యత విషయంలో కానీ ఇంకా పెదవి విప్పలేదు. కస్టమర్ల నుంచి ఆర్డర్ల మేరకు ఈ బైక్‌ను ఆయా ప్రాంతాలలో విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

ఏరియల్ ఏస్ బైక్

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, June 27, 2014, 15:33 [IST]
English summary
Ariel Motors had recently made news public that it was working on a modern two wheeler. The Britain based manufacturer is the maker of the famous Ariel Atom. They have revealed its motorcycle that has been christened as the Ariel Ace.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+