ఆడి సరికొత్త మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ 'ఆడి మోటారాడ్'

By Ravi

లగ్జరీ కార్లను తయారు చేసే సంస్థ మోటార్‌సైకిళ్లను రూపొందిస్తే ఎలా ఉంటుంది..? జర్మనీకు చెందిన లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఓ అద్భుతమైన మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేయనుంది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఇటాలియన్ సూపర్‌బైక్ కంపెనీ డ్యుకాటిని గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో 1.1 బిలియన్ డాలర్లను చెల్లించి ఆడి కొనుగోలు చేసిన సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, డ్యుకాటి సహకారంతో ఆడి బ్రాండ్ లగ్జరీ మొబిలిటీ వాహనాలను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఆడి మోటారాడ్ అని పిలిచే ఈ కాన్సెప్ట్ బైక్‌ను ఫ్రెంచ్ డిజైనర్ థిబాల్ట్ డెవాజ్ అతని సోదరుడు మార్క్ డెవాజ్‌లు డిజైన్ చేశారు. దీనిని మోడలర్ క్లెమెంట్ కౌరెర్ షేప్ చేశారు. ఈ ఆడి మోటారాడ్ బైక్ ఆడి యొక్క ఎల్ఈడి లైటింగ్ థీమ్‌ను స్పష్టంగా ప్రతిభింభింప జేస్తుంది.

ఆడి మోటారాడ్ బైక్ కాన్సెప్ట్ డిజైన్స్ చూడటానికి ఎలక్ట్రిక్ బైక్‌లా ఉన్నప్పటికీ, ఇందులో డ్యుకాటి నుంచి గ్రహించిన 850సీసీ ఎల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. స్పోర్ట్స్ బైక్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని ఈ డిజైన్‌కు మెరుగులు అద్దారు. ఆడి యొక్క ఆల్ట్రా లైట్‌వెయిట్ ఫ్రేమ్ టెక్నాలజీ, కార్బన్ ఫైబర్ మరియు అధునాతన అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో దీనిని రూపొందించనున్నారు.

ఆడి టూవీలర్ ప్లాన్‌ను గమనిస్తే, ఈ సెగ్మెంట్లోని తమ సమీప పోటీదారు బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా తమ కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో ఈ బైక్ సక్సెస్ సాధించినట్లయితే, భవిష్యత్తులో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్‌కు పోటీగా మరిన్ని ఆడి-డ్యుకాటి సూపర్‌బైక్‌లు మార్కెట్లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అసరం లేదు. ఈలోపుగా ఆడి మోటారాడ్ కాన్సెప్ట్ స్కెచ్‌లను చూద్దాం రండి..!

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

ఆడి మోటారాడ్ కాన్సెప్ట్

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2013, 11:03 [IST]
English summary
German luxury carmaker Audi is planning to enter in two wheeler market. Towards this move, Audi has showcased an awesome motorcycle concept - Audi Motorrad. Check out this Audi's new Motorcycle concept through pictures.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+