విడుదలకు ముందే కెమెరాకు చిక్కిన బజాజ్ పల్సర్ 200ఎస్ఎస్

By Ravi

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో రెండు సరికొత్త 400సీసీ మోడళ్లను (400ఎస్ఎస్, 400సిఎస్) ప్రదర్శించిన సంగతి తెలిసినదే. వాస్తవానికి ఈ 400సీసీ బైక్‌లను కంపెనీ ముందుగా మార్కెట్లో విడుదల చేస్తుందని అందరూ భావించినప్పటికీ, అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

ఎందుకంటే, బజాజ్ ఆటో ఈ 400సీసీ బైక్‌ల కన్నా ముందుగా 200ఎస్ఎస్, 200సిఎస్ మోడలళ్లను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బజాజ్ తయారు చేస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కానీ లేదా పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై కానీ ఈ స్పోర్ట్ వెర్షన్ బైక్‌లను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.


ఈ కొత్త బజాజ్ బైక్‌ను పల్సర్‌కు 200ఎస్ఎస్ అనే పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బైక్‌ను పూనే రోడ్లపై కంపెనీ టెస్ట్ చేస్తోంది. ఈ బైక్‌ను మహారాష్ట్రలోని చాకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. బజాజ్ 200ఎస్ఎస్ బైక్ టెస్టింగ్ దశలో ఉండగా, ఆ దృశ్యం డ్రైవ్‌స్పార్క్ కెమెరాకు చిక్కింది (ఈ ఫొటోలో చూడొచ్చు). బైక్‌ను గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా దీనిని పూర్తిగా క్యామోఫ్లేడ్జ్ చేశారు.

బజాజ్ పల్సర్ 200ఎస్ఎస్ డిజైన్ చూడటానికి 400ఎస్ఎస్ మాదిరిగానే అనిపిస్తుంది. ఈ మోడల్ ఉత్పత్తి దశకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఇది మార్కెట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. పోటీతత్వ వాతావరణంతో కూడుకున్న ద్విచక్ర వాహన విభాగంలో తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు బజాజ్ ఆటో గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

Bajaj 200SS Spyshot

బజాజ్ 200ఎస్ఎస్ బైక్‌లో సరికొత్త 200సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌లో కంపెనీ పేటెంటెడ్ ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 200ఎన్ఎస్ బైక్‌లోను ఇదే ఇంజన్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 23.52 పిఎస్‌ల శక్తిని, 18.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
Most Read Articles

English summary
The Indian manufacturer Bajaj has been teasing everyone by showcasing the Pulsar 400SS and 400CS at the 2014 Auto Expo held in New Delhi. Bajaj manufacturer its vehicle at its Chakan facility in Pune, Maharashtra. The bike is being tested almost everyday in city as well as open roads.
Story first published: Monday, June 16, 2014, 9:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X