బ్లేడ్ 125తో స్కూటర్ సెగ్మెంట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న బజాజ్
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ బజాజ్ ఆటో గతంలో స్వస్తి పలికిన స్కూటర్ విభాగానికి తిరిగి స్వాగతం పలకనుంది. ప్రస్తుతం టూవీలర్ మార్కెట్లో స్కూటర్లకు మంచి డిమాండ్ ఏర్పడుతుండటంతో, ఈ సెగ్మెంట్లోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు బజాజ్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, గడచిన 2008 ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో ప్రదర్శనకు ఉంచిన 125సీసీ కాన్సెప్ట్ స్కూటర్ 'బజాజ్ బ్లేడ్' ఆధారంగా తయారు చేసిన ఓ సరికొత్త స్కూటర్‌ను ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాన్సెప్ట్ వెర్షన్ బజాజ్ బ్లేడ్ 125 స్కూటర్‌కు ప్రొడక్షన్ వెర్షన్ బజాజ్ బ్లేడ్ 125 స్కూటర్‌కు మధ్య అనేక పోలికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. 2008 ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో బ్లేడ్ 125సీసీ స్కూటర్‌తో పాటుగా తమ ఎక్స్‌సిడి స్ప్రింట్, డిస్కవర్ 150 డిటిఎస్ఐ మోటార్‌సైకిళ్లను కూడా ప్రదర్శనకు ఉంచింది. వీటిళ్లో ఆ రెండు మోటార్‌సైకిళ్లకు ఉత్పత్తి దశకు చేరగా బ్లేడ్ స్కూటర్ మాత్రం ఉత్పత్తికి నోచుకులేకపోయింది. ప్రస్తుతం బజాజ్ ఆటో స్కూటర్ సెగ్మెంట్లో తామేం కోల్పోతున్నామో తెలుసుకున్నట్లుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ సెగ్మెంట్లోకి రీ-ఎంట్రీ ఇ్వవాలని కంపెనీ యోచిస్తోంది.
బజాజ్ బ్లేడ్ స్కూటర్‌లో 125సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. ఇది కిక్/ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆప్షన్లతో పాటుగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఫ్రంట్ ఫ్యూయెల్ ఫిల్లింగ్, టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ హెడ్‌ల్యాంప్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్వర్స్, 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి విశిష్టమైన ఫీచర్లతో రావచ్చని సమాచారం. దేశీయ విపణిలో దీని ధర రూ.40,000 నుంచి రూ.45,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. వచ్చే జులై నాటికి ఇది మార్కెట్లోకి విడుదల కావచ్చని తెలుస్తోంది.

బజాజ్ బ్లేడ్ 125సీసీ ఆటోమేటిక్ స్కూటర్

బజాజ్ బ్లేడ్ 125సీసీ ఆటోమేటిక్ స్కూటర్

బజాజ్ బ్లేడ్ 125సీసీ ఆటోమేటిక్ స్కూటర్

బజాజ్ బ్లేడ్ 125సీసీ ఆటోమేటిక్ స్కూటర్

బజాజ్ బ్లేడ్ 125సీసీ ఆటోమేటిక్ స్కూటర్
బజాజ్ ఆటో నుంచి కొత్తగా రానున్న బ్లేడ్ 125సీసీ స్కూటర్ ఈ సెగ్మెంట్లోని హోండా యాక్టివా, డియో, యమహా రే, సుజుకి స్విష్, మహీంద్రా రోడియో తదితర మోడళ్లకు పెను సవాలుగా నిలువనుంది. ఇదిలా ఉండగా, బజాజ్ ఆటో తమ క్రిస్టల్ స్కూటర్‌ను ఆధారంగా చేసుకొని మరొక సరికొత్త స్కూటర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, స్కూటర్ సెగ్మెంట్లో చరిత్ర సృష్టించిన బజాజ్ ఆటో తిరిగి ఈ విభాగంలోనికి ప్రవేశించటం చెప్పుకోదగిన విషయం.


Click it and Unblock the Notifications








