బజాజ్ డిస్కవర్ 150ఎఫ్, డిస్కవర్ 150ఎస్ విడుదల

By Ravi

బజాజ్ ఆటో ఇదివరకు ప్రకటించినట్లుగానే, తమ డిస్కవర్ బ్రాండ్‌లో రెండు సరికొత్త 150సీసీ వేరియంట్లను నేడు (ఆగస్ట్ 11, 2014) మార్కెట్లో విడుదల చేసింది. వీటి పేర్లు - డిస్కవర్ 150ఎఫ్ (లార్జ్ హాఫ్ ఫెయిరింగ్‌తో), డిస్కవర్ 150ఎస్ (స్టాండర్డ్ ఫెయిరింగ్‌తో).

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల; ధరలు

బజాజ్ ఆటో తొలిసారిగా 2004లో డిస్కవర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాతి కాలంలో ఈ బ్రాండ్‌లో అనేక మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. డిస్కవర్ బ్రాండ్ పెర్ఫార్మెన్స్, మైలేజ్, పికప్, ధర వంటి అనేక అంశాల్లో అగ్రగామిగా నిలిచింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఇంజన్

ఇంజన్

కొత్త 150సీసీ వెర్షన్ డిస్కవర్ 150ఎఫ్, డిస్కవర్ 150ఎస్ రెండు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో 145సీసీ, 4-వాల్వ్, డిటిఎస్-ఐ ఇంజన్ గరిష్టంగా 14.5 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

మైలేజ్

మైలేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త బజాజ్ డిస్కవర్ 150సీసీ బైక్స్ లీటరుకు 72 కి.మీ. మైలేజీనిస్తాయి. వీటి ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు (1.9 లీటర్లు రిజర్వ్).

సస్పెన్షన్ అండ్ బ్రేక్స్

సస్పెన్షన్ అండ్ బ్రేక్స్

మెరుగైన కంఫర్ట్ కోసం ఈ రెండు బైక్‌లలో నైట్రాక్స్ సస్పెన్షన్‌తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్‌‌ను ఉపయోగించారు. సమర్థవంతమైన బ్రేకింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇవి పెటల్ డిస్క్ బ్రేక్స్‌తో లభిస్తాయి.

ఫీచర్స్

ఫీచర్స్

స్టయిలిష్ డిజిటల్ మీటర్, బెటర్ రోడ్ గ్రిప్ కోసం వెడల్పాటి ట్యూబ్‌లెస్ టైర్స్, డిసి లైటింగ్ (తక్కువ వేగం వద్ద కూడా కాంతివంతమైన లైటింగ్) వంటి ఫీచర్లు కొత్త 150సీసీ డిస్కవర్ బైక్‌ల సొంతం.

ధరలు

ధరలు

భారత మార్కెట్లో బజాజ్ డిస్కవర్ 150సీసీ బైక్‌ల ధరలు ఇలా ఉన్నాయి:

* బజాజ్ డిస్కవర్ 150ఎఫ్ : రూ.58,739

* బజాజ్ డిస్కవర్ 150ఎస్ : రూ.51,720 (డ్రమ్ బ్రేక్)

* బజాజ్ డిస్కవర్ 150ఎస్ : రూ.54,725 (డిస్క్ బ్రేక్)

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, పూనే)

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

ఈ రెండు వేరియంట్లు నాలుగు ఆకర్షనీయమైన రంగులలో (డార్క్ బ్లూ, వైన్ రెడ్, ఎబోనీ బ్లాక్, డార్క్ బాటిల్ గ్రీన్) లభ్యమవుతాయి.

బజాజ్ డిస్కవర్ 150

కొత్త బజాజ్ డిస్కవర్ 150ఎస్ భారత్‌లో ఈ సెగ్మెంట్లో అత్యంత సరసమైన ధరకే లభిస్తున్న150సీసీ బైక్ కాగా, బజాజ్ డిస్కవర్ 150ఎఫ్ దేశంలో కెల్లా మొట్టమొదటి హాఫ్ పెయిర్డ్ బైక్‌గా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Monday, August 11, 2014, 14:40 [IST]
English summary
Indian two wheeler major Bajaj Auto has launched two new 150cc motorcycles under Discover brand. The new Bajaj Discover 150S and Discover 150F are powered by a 145cc 4-valve single-cylinder DTS-i with ExhausTEC engine that churns out 14.5 PS of power and 12.75Nm of torque. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+