సరికొత్త డిస్కవర్ 125ఎమ్ బైక్‌ని విడుదల చేసిన బజాజ్

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ నేడు (మార్చ్ 7, 2014, శుక్రవారం) ఓ సరికొత్త 125సీసీ డిస్కవర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బెస్ట్ ఇన్ క్లాస్ పవర్, పికప్ మరియు డ్రైవబివిలిటీని ఆఫర్ చేసేలా కొత్త డిస్కవర్ 125ఎమ్ (ఎమ్ అంటే మైలేజ్) బైక్‌ని తయారు చేశామని కంపెనీ ప్రెసిడెంట్ (మోటార్‌సైకిల్ బిజినెస్) కె శ్రీనివాసన్ తెలిపారు.

అనేక మంది కస్టమర్లు కేవలం 8 పిఎస్ శక్తిని మాత్రమే ఆఫర్ చేసే రెగ్యులర్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల పట్ల విసుగెత్తి పోయారని, ఆకర్షనీయమైన లుక్ మరియు స్పోర్టీయర్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని సుపీరియర్ టెక్నాలజీ మరియు ఫీచర్లతో ఈ కొత్త డిస్కవర్ 125సీసీ బైక్‌ను అభివృద్ధి చేశామని ఆయన వివరించారు.


కొత్త బజాజ్ డిస్కవర్‌లోని 124.6సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-వాల్వ్, డిటిఎస్-ఐ ఇంజన్ గరిష్టంగా 11.5 పిఎస్‌ల శక్తిని, 10.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఆఫర్ చేస్తుందని, మైలేజ్‌లో కూడా ఇది ఎక్కడా రాజీ పడకుండా లీటరుకు గరిష్టంగా 76 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని శ్రీనివాసన్ తెలిపారు.

ఆకర్షనీయమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, పెటల్ డిస్క్ బ్రేక్ మరియు స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌ను ఈ బైక్‌లో ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఇందులో నాట్రాక్స్ సస్పెన్షన్ కంఫర్టబల్ రైడ్‌ను ఆఫర్ చేస్తుందని శ్రీనివాసన్ వెల్లడించారు.

Bajaj Auto Launches New Discover 125M

దేశీయ విపణిలో డిస్కవర్ 125ఎమ్ డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ.48,000 గాను మరియు డిస్క్ బ్రేక్ వెర్షన్ ధర రూ.50,000 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గాను ఉన్నాయి. ఇది ఎలక్ట్రాన్ బ్లూ, వైన్ రెడ్, చార్కోల్ మాగ్నెటా, చార్కోలీ గ్రీన్, సిల్వర్ బ్లూ మరియు సిల్వర్ గోల్డ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 7, 2014, 17:34 [IST]
English summary
Bajaj Auto has launched its new Discover 125M motorcycle. The new Discover 125M drum brake variant is priced at Rs 48,000 and the disc brake version is available for Rs 50,000 (all prices ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+