బజాజ్ డిస్కవర్ 100ఎమ్ విడుదల; ధర రూ.45,996

By Ravi

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో, తమ డిస్కవర్ బ్రాండ్‌లో నేడు (అక్టోబర్ 15, 2013) ఓ సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 100సీసీ ఇంజన్ కలిగిన ఈ కొత్త డిస్కవర్ 100ఎమ్ (Discover 100M) లీటరుకు 84 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త డిస్కవర్ 100ఎమ్ బైక్‌లో బజాజ్ పేటెంట్ పొందిన 4-వాల్వ్ డిటిఎస్-ఐ టెక్నాలజీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 9.3 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దేశీయ విపణిలో దీని ధరను రూ.45,996 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

Discover 100 M

డిస్కవర్ 100ఎమ్ బైక్‌లోని విశిష్టమైన ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి:
  • అధునాతన టెక్నాలజీ - ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి 4-వాల్వ్ డిటిఎస్-ఐ ఇంజన్
  • అమేజింగ్ మైలేజ్ - 84 కెఎమ్‌పిఎల్
  • ఇంజన్ పెర్ఫామెన్స్ - 9.3 పిఎస్ పవర్, 9.02 ఎన్ఎమ్ టార్క్
  • పవర్ టూ వెయిట్ రేషియో (పిటిడబ్ల్యూ) - 82పిఎస్/టన్
  • టాప్ స్పీడ్ - 95 కెఎమ్‌పిహెచ్
  • ఎలక్ట్రిక్ స్టార్ (స్డాండర్డ్ ఫీచర్‌గా)
  • గ్యాస్ ఫిల్డ్ నైట్రాక్స్ సస్పెన్షన్
  • లో మెయింటినెన్స్ బ్యాటరీ
  • పెటల్ డిస్క్ బ్రేక్
  • ప్రీమియం అల్యూమినియం సైడ్ సెట్స్

కొత్త డిస్కవర్ 100ఎమ్ మోటార్‌సైకిల్ ఐదు ఆకర్షనీయమైన రంగులలో [ఫ్లేమ్ రెడ్, బ్రిలియంట్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ (రెడ్ డెకాల్స్), మిడ్‌నైట్ బ్లాక్ (బ్లూ డెకాల్స్), మిడ్‌నైట్ బ్లాక్ (ఆలివ్ డెకాల్స్)] లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 15, 2013, 15:31 [IST]
English summary
Bajaj Auto, has launched a new 100cc bike - the Discover 100M. Powered by Bajaj’s patented 4-valve DTS-i technology, the bike provides an impressive 9.3 Ps of power, while still delivering unmatched fuel efficiency of 84 km/l (as per CMVR norms). The Discover 100M will be priced at Rs. 45,996 (ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+