బజాజ్ ఆటో నుంచి మరో సరికొత్త క్రూజర్ బైక్ వస్తోంది!
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రస్తుతం క్రూజర్ బైక్ సెగ్మంట్లో నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఈ సెగ్మెంట్లో బజాజ్ అవెంజర్ 220 మోడల్‌ను మాత్రమే కంపెనీ విక్రయిస్తున్నప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. వాస్తవానికి క్రూజర్ బైక్ సెగ్మెంట్లో లభిస్తున్న అత్యంత చవకైన మోటార్‌సైకిల్ కూడా ఇదే.
ఈ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని బజాజ్ ఆటో ఈ విభాగంలో మరో సరికొత్త స్కూటర్‍ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం బజాజ్ సగటున దేశవ్యాప్తంగా నెలకు 3,500 అవెంజర్ క్రూజర్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది.

క్రూజర్ బైక్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో సరికొత్త ఫీచర్లు, మోడ్రన్ డిజైన్‌తో కూడిన మరో కొత్త మోడల్‌ను ఈ సెగ్మెంట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తొందని బజాజ్ మోటార్‌సైకిల్ డివిజన్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ వెల్లడించారు. బజాజ్ ఆటో కొత్తగా అభివృద్ధి చేసిన డిస్కవర్ 150 మోడళ్లను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కొత్త క్రూజర్ బైక్‌కు సంబంధించి అంతకు మించిన విషయాలను ఆయన వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా, స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో తమ పాపులర్ పల్సర్ బ్రాండ్‌లో మరో రెండు కొత్త మోడళ్లను కూడా పరిచయం చేస్తామని ఎరిక్ వాస్ తెలిపారు. సగటున దేశవ్యాప్తంగా నెలకు 56,000 పల్సర్ బైక్‌లు అమ్ముడుపోతున్నాయని, స్పోర్ట్స్ బైక్‌ల్లో 50 శాతం వాటా పల్సర్‌దేనని ఆయన వివరించారు. ఇకపోతే తమ డిస్కవర్ బ్రాండ్‌లో సగటున నెలకు 71,000 బైక్‌లు విక్రయిస్తున్నామని, ఇకపై ప్రతి 3 నెలలకు ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెడతామని వాస్ చెప్పారు.


Click it and Unblock the Notifications








