పల్సర్ ఉత్పత్తిని ఔరంగాబాద్‌కు తరలించనున్న బజాజ్
బజాజ్ ఆటో పూనే ప్లాంటులో కార్మికులకు, యాజమాన్యానికి మధ్య సయోధ్య కుదరడం లేదు. జీతాల పెంపు విషయంలో కార్మికులు కొనసాగిస్తున్న సమ్మె సోమవారంతో 14వ రోజుకు చేరుకుంది. జూన్ 25వ నుంచి మొదలైన ఈ సమ్మె వల్ల ఇప్పటి వరకు 20,000 యూనిట్లకు పైగా ఉత్పత్తి నష్టపోయింది. అయితే, కొద్ది మంది కార్మికులతో పనిచేస్తుండటంతో స్వల్పస్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది.
ఉత్పత్తికి అంతరాయం వాటిళ్లిన కారణంగా కొన్ని రకాల బజాజ్ మోటార్‌సైకిళ్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరుగుతోంది. ఈ ప్లాంటులో ఎక్కువగా పల్సర్, కెటిఎమ్ బ్రాండ్ ఉత్పత్తులు తయారవుతాయి. కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న పల్సర్ రేంజ్ బైక్‌ల ఉత్పత్తి అంతరాయం వాటిళ్లుతుండంతో ఈ మోడళ్ల ఉత్పత్తిని ఔరంగాబాద్ ప్లాంటుకు తరలించాలని కంపెనీ నిర్ణయించింది.
బజాజ్ ఆటోకు మొత్తం మూడు ప్లాంట్లు ఉన్నాయి. అందులో ఒకటి చాకన్ (పూనే)లో ఉండగా మరొకటి పాంట్నగర్ (ఉత్తరాంచల్)లోను, ఇంకొకటి ఔరంగాబాద్ (మహారాష్ట్ర)లోను ఉన్నాయి. కాగా.. చాకన్ ప్లాంటులో కంపెనీ ఆదాయాలు తెచ్చిపెట్టే పల్సర్, కెటిఎమ్ డ్యూక్ 200, 390 మరియు కవాసకి నిన్జా ప్రీమియం బైక్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ప్లాంటులో రోజుకు 3000 వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
తాజాగా విడుదల చేసిన డ్యూక్ 390 మోడల్‌కు భారీ సంఖ్యలో ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. దీంతో ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరుగుతోంది. మరి ఈ సమ్మె సద్దుమణిగేది ఎప్పటికో కాలమే నిర్ణయించాలి.



Click it and Unblock the Notifications








