సెప్టెంబర్ నెలాఖరు నుంచి కెటిఎమ్ డ్యూక్ 390 డెలివరీ

దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో, ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్‌లు సంయుక్తంగా అందిస్తున్న స్పోర్ట్స్ బైక్ కెటిఎమ్ 390 డ్యూక్ డెలివరీలను సెప్టెంబర్ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. బజాజ్-కెటిఎమ్ ఈ ప్రీమియం బైక్‌ను రూ.1.80 లక్షల ధరతో గడచిన జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది.

ప్రస్తుతం కెటిఎమ్ 390 డ్యూక్ బైక్‌ను 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉందని, తమ కంపెనీ ఇప్పటి వరకూ 1500 యూనిట్లకు బుకింగ్‌లను అందుకుందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) అమిత్ నంది తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి ఈ మిడ్-సైజ్ స్పోర్ట్స్ బైక్ దేశీయ డెలివరీలను ప్రారంభిస్తామని ఆయన వివరించారు.

ఛాకన్ ప్లాంటులో డిజైన్ చేసి, డెవలప్ చేసిన ఈ బైక్‌ను కెటిఎమ్ పోర్ట్‌ఫోలియోలో లభిస్తున్న మూడవ ఉత్పత్తి. ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్, సాటిలేని పవర్‌లతో దీనిని రూపొందించారు. ఈ బైక్‌లో ఉపయోగించిన 373.2సీసీ ఇంజన్ గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.

KTM 390 Duke

భారతదేశంలోనే ఇది తొలి మిడ్-సైజ్ స్పోర్ట్స్ బైక్ కావటం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న 71 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, సర్వీస్ సెంటర్ల ద్వారా 390 డ్యూక్ లభ్యం కానుంది. దీని పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది. పవర్‌ఫుల్ ఇంజన్, లైట్ వెయిట్ మరియు ఈజీ హ్యాండ్లింగ్ దీని ప్రత్యేకతలు.

భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ బైక్ సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు. ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 145 కిలోల బరువు, మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు, స్పోర్టీ డిజైన్ వంటి ప్రధాన ఫీచర్లు కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ సొంతం. భారత మార్కెట్లో కెటిఎమ్ 390 డ్యూక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, August 19, 2013, 11:15 [IST]
English summary
Bajaj Auto said it will commence the domestic delivery of its mid-size sports bike KTM 390 Duke by end of September. The city-based auto-maker launched the premium segment bike, priced at Rs 1.80 lakh, in June.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+