2015 మధ్య భాగం నాటికి రానున్న బజాజ్ అవెంజర్ ఫేస్‌లిఫ్ట్
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న క్రూజర్ మోటార్‌సైకిల్ 'బజాజ్ అవెంజర్' (Bajaj Avenger)లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్లాసిక్ క్రూజర్‌కు మరింత మోడ్రన్ టచ్ ఇచ్చేలా బజాజ్ ఆటో జాగ్రత్తలు తీసుకోనుంది.
ప్రస్తుత అవెంజర్‌లో ఉపయోగిస్తున్న కొన్ని భాగాలను కొత్త అవెంజర్‌లోను కొనసాగించడమే కాకుండా, ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో మరిన్ని కొత్త భాగాలను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొత్త బజాజ్ అవెంజర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 220సీసీ ఇంజన్‌ను తొలగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

బజాజ్ ఆటో ఇప్పటి వరకూ ఈ 220సీసీ ఇంజన్‌ను తమ పల్సర్ 220 మోడల్‌లోను, అవెంజర్ మోడల్‌లోను ఉపయోగిస్తోంది. అయితే, కంపెనీ ఇటీవలే తమ పల్సర్ 220 మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించి వేయడంతో, ఇప్పుడు కేవలం అవెంజర్ మోడల్‌లో మాత్రమే ఈ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.
కాగా.. కొత్త బజాజ్ అవెంజర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రస్తుత 220సీసీ ఇంజన్‌కు బదులుగా కంపెనీ అందిస్తున్న 200ఎన్ఎస్ మోడల్‌లో ఉపయోగిస్తున్న 200సీసీ ఇంజన్‌ను ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్‌లో ఉపయోగించిన 199సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 28 బిహెచ్‌పిల శక్తిని, 18 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్‌లో కార్బురేటర్‌నే ఉపయోగిస్తున్నప్పటికీ, ఇందులోని 3 స్పార్క్ ప్లగ్స్ వలన మైలేజ్ మెరుగ్గా ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








