మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన బజాజ్ సిటి 100
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గతంలో నిలిపి వేసిన తమ 100సీసీ బైక్ 'బజాజ్ సిటి 100' (Bajaj C T100)ను తిరిగి మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2015 బజాజ్ సిటి 100 మోటార్‌సైకిల్ అల్లాయ్ వీల్స్ మరియు సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.
బజాజ్ సిటి 100 బడ్జెట్ మోటార్‌సైకిల్‌లో 99.27సీసీ, ఫోర్-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో బజాజ్ పేటెంట్ పొందిన షాక్-ఇన్-షాక్ సస్పెన్షన్ సెటప్‌ను ఆఫర్ చేస్తున్నారు.
మాస్ మార్కెట్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బజాజ్ ఆటో తమ బడ్జెట్ మోటార్‌సైకిళ్ల తిరిగి జీవం పోస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే బజాజ్ ఆటో ఇటీవలే ఓ రిఫ్రెష్డ్ ప్లాటినా 100సీసీ మోటార్‌సైకిల్‌ను ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్‌తో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త బజాజ్ సిటి 100 బైక్ ధర రూ.38,895 (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది.

బజాజ్ ఆటో గతంలో నిలిపి వేసిన తమ 100సీసీ బైక్ 'బజాజ్ సిటి 100' (Bajaj C T100)ను తిరిగి మార్కెట్లో విడుదల చేసింది

కొత్త 2015 బజాజ్ సిటి 100 మోటార్‌సైకిల్ అల్లాయ్ వీల్స్ మరియు సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.

దేశీయ విపణిలో ఈ కొత్త బజాజ్ సిటి 100 బైక్ ధర రూ.38,895 (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది.

బజాజ్ సిటి 100 బడ్జెట్ మోటార్‌సైకిల్‌లో 99.27సీసీ, ఫోర్-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో బజాజ్ పేటెంట్ పొందిన షాక్-ఇన్-షాక్ సస్పెన్షన్ సెటప్‌ను ఆఫర్ చేస్తున్నారు.

బజాజ్ సిటి 100 అల్లాయ్ వీల్స్ ఫీచర్‌తో లభిస్తుంది.

బజాజ్ సిటి 100 బైక్‌ను సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో డిజైన్ చేశారు.

బజాజ్ సిటి 100లో కొత్త డిజైన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్ ఉంటుంది.

బజాజ్ సిటి 100లో సైలెన్సర్ పై హీట్ షీల్డ్‌ని ఆఫర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








