బజాజ్ డిస్కవర్ 125ఎమ్ మోటార్‌సైకిల్ వివరాలు
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ గడచిన మార్చ్ నెలలో 125సీసీ డిస్కవర్ సిరీస్‌లో 'డిస్కవర్ 125ఎమ్' పేరిట ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త డిస్కవరీ 125ఎమ్ బైక్‌కి సంబంధించిన కొన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
ఇది కూడా చదవండి: బజాజ్ డిస్కవర్ 125ఎస్‌టి బంద్!
కొత్త బజాజ్ డిస్కవర్ 125ఎమ్ పేరులో ఎమ్ అంటే మైలేజ్ అని అర్థం. బెస్ట్ ఇన్ క్లాస్ పవర్, పికప్ మరియు డ్రైవబిలిటీని ఆఫర్ చేసేలా కొత్త డిస్కవర్ 125ఎమ్ బైక్‌ని తయారు చేశామని కంపెనీ తెలిపింది. ఆకర్షనీయమైన లుక్, స్పోర్టీయర్ పెర్ఫార్మెన్స్, సుపీరియర్ టెక్నాలజీ మరియు మోడ్రన్ ఫీచర్లతో ఈ కొత్త డిస్కవర్ 125సీసీ బైక్‌ను అభివృద్ధి చేశామని బజాజ్ వెల్లడించింది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలకు ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని వివరాలు తెలుసుకోండి.

కేవలం 8 పిఎస్ పవర్‌ను మాత్రమే ఆఫర్ చేసే రెగ్యులర్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల పట్ల విసుగెత్తి పోయిన కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని, పవర్, మైలేజ్‌ల విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఈ కొత్త బైక్‌ని తయారు చేశామని కంపెనీ తెలిపింది.

కొత్త బజాజ్ డిస్కవర్ 125ఎమ్‌లో 124.6సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-వాల్వ్, డిటిఎస్-ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 11.5 పిఎస్‌ల శక్తిని, 10.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, సాటిలేని పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు గరిష్టంగా 76 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. అయితే, రియల్ వరల్డ్ కండిషన్స్ ప్రకారం, ఇది లీటరుకు 60-65 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వొచ్చని అంచనా.

ఆకర్షనీయమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, పెటల్ డిస్క్ బ్రేక్ మరియు స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌ను ఈ బైక్‌లో ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఇందులో అమర్చిన నైట్రాక్స్ సస్పెన్షన్ మరింత సౌకర్యవంతమైన రైడ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త బజాజ్ డిస్కవర్ 125ఎమ్ ఎలక్ట్రాన్ బ్లూ, వైన్ రెడ్, చార్కోల్ మాగ్నెటా, చార్కోలీ గ్రీన్, సిల్వర్ బ్లూ మరియు సిల్వర్ గోల్డ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

దేశీయ విపణిలో బజాజ్ డిస్కవర్ 125ఎమ్ డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ.48,000 గాను మరియు డిస్క్ బ్రేక్ వెర్షన్ ధర రూ.50,000 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గాను ఉన్నాయి.


Click it and Unblock the Notifications








