క్రిస్టల్ డిటిఎస్-ఐ స్కూటర్‌ను పునఃప్రవేశపెట్టనున్న బజాజ్

By Ravi

చివరకు బజాజ్ తన తప్పు తెలుసుకున్నట్లుంది. కేవలం ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లపై మాత్రమే దృష్టి సారిస్తూ, స్కూటర్ సెగ్మెంట్‌కు గుడ్‌బై చెప్పిన బజాజ్ ఇప్పుడు తిరిగి ఈ సెగ్మెంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రస్తుతం భారత ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్ విభాగం గణనీయంగా విస్తరిస్తోంది. ఈ సెగ్మెంట్లోకి కొత్తగా ప్రవేశిస్తున్న కంపెనీలు, మోడళ్లతో కొనుగోలుదారులకు విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చి, ఫలితంగా ఈ సెగ్మెంట్లో అమ్మకాలు కూడా క్రమంగా జోరందుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో, ఒకప్పుడు స్కూటర్ సెగ్మెంట్లో ఓ చరిత్ర సృష్టించి ఇప్పుడు వాటిని వదిలేసుకున్న బజాజ్ ఆటో మళ్లీ స్కూటర్లను పునఃప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా, భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త ఆటోమేటిక్ స్కూటర్‌ను బజాజ్ అభివృద్ధి చేస్తోంది. ఇది 125-150సీసీ రేంజ్‌లో ఓ ఫోర్-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. క్రిస్టల్ అనే పేరుతో బజాజ్ ఓ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి 2007లో బజాజ్ ఆటో క్రిస్టల్ అనే పేరుతో ఓ ఆటోమేటిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌ను ఆధారంగా చేసుకొనే ఇందులో మరింత ఆకర్షనీయమై, అధునాతనమైన స్కూటర్‌ను బజాజ్ ఆటో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ స్కూటర్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఓ సరికొత్త ఆటోమేటిక్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

2007లో బజాజ్ ఆటో విడుదల చేసిన క్రిస్టల్ ఆటోమేటిక్ స్కూటర్‌ను ఆధారంగా చేసుకొని, దానికి అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, అత్యాధునిక ఫీచర్లతో అభివృద్ధి చేసిన క్రిస్టల్ డిటిఎస్-ఐ స్కూటర్‌ను బజాజ్ విడుదల చేయనుంది.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

ఫ్రంట్ ఫ్యూయెలింగ్

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ స్కూటర్‌లో పెట్రోల్ ఫిల్ చేయుంచుకోవటానికి, స్కూటర్ నుండి దిగి, సీట్ తొలగించాల్సిన అవసరం లేకుండానే ముందువైపు అమర్చిన ఫ్యూయెల్ ట్యాంక్ లిడ్ సాయంతో పెట్రోల్‌ను నింపుకోవచ్చు. ఇది రిమోట్ ఓపెనింగ్ ఫ్యూయెల్ క్యాప్. దీని అన్‌లాక్-లాక్ చేయటం చాలా సులువు.

ఎక్స్‌ట్రా లార్జ్ స్టోరేజ్ స్పేస్

22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఈ స్కూటర్ ప్రత్యేకం. రిమోట్ ఓపెనింగ్ సిస్టమ్ కలిగి ఈ సీట్‌ క్రింది భాగంలో ఓ ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. సీట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ లైట్ వెలుగుతుంది. సీట్ సరిగ్గా క్లోజ్ కాకపోయినా, ఓపెన్ అయినా అలారమ్ మ్రోగుతుంది.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

డిటిఎస్-ఐ ఇంజన్

ఇందులో బజాజ్ అభివృద్ధి చేసిన డిటిఎస్-ఐ ఇంజన్‌ను ఉపయోగించారు (ఇంజన్ సాంకేతిక వివరాలు తెలియాల్సి ఉంది). ఇది మెరుగైన పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండనుంది.

పెంటా లాక్

ఒకే 5-ఫంక్షన్స్ ఈ పెంటా కీ ప్రత్యేకత. ఈ కీ ద్వారా ఒకే చోటు నుంచే ఇంజన్‌ను స్టార్ట్ చేయటం, పెట్రోల్ ట్యాంక్ క్యాప్‌ను ఓపెన్ చేయటం, సీట్‌ను ఓపెన్ చేయటం, హ్యాండింల్‌ను లాక్ చేయటం మరియు యాక్సిలరేటర్‌ను లాక్ చేయటం చేయవచ్చు. ఇది బజాజ్ క్రిస్టల్‌కు పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తుంది.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

ఆటోమేటిక్ ల్యాంప్

బజాజ్ క్రిస్టల్‌లో ఆటోమేటిక్ ల్యాంప్‌ను ఉపయోగించారు. రాత్రివేళల్లో, చీకటి ప్రదేశాల్లో, పార్కింగ్ తదితర కాంతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ స్కూటర్ ఆటోమేటిక్‌గా హెడ్‌లైట్స్, పైలట్ ల్యాంప్స్, టెయిల్ లైట్, స్పీడో కన్సోల్ లైట్లు ఆన్ అవుతాయి.

ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్

ఇందులో వెనుక వైపు స్ప్రింగ్ ఇన్ సస్పెన్షన్ (ఎస్ఎన్ఎస్) సస్పెన్షన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. అన్ని రోడ్లపై సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణి అనుభూతికి ఈ సస్పెన్షన్ సిస్టమ్ ఎంతో చక్కగా ఉంటుంది.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

లో బ్యాటరీ ఇండికేటర్

బ్యాటరీ సామర్థ్యం నిర్దేశిత స్థాయి కన్నా తగ్గినట్లయితే ఇది గుర్తు చేస్తుంది.

రిజర్వ్ ఇండికేటర్‌తో కూడిన ఫ్యూయెల్ గేజ్

ఇంధన ట్యాంకులో పెట్రోల్ రిజర్వ్ స్థాయికి చేరుకున్నప్పుడు ఇందులో రిజర్వ్ ఇండికేటర్‌తో కూడిన ఫ్యూయెల్ గేజ్ గుర్తు చేస్తుంది.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ

బజాజ్ క్రిస్టల్ స్కూటర్‌లో మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీని ఉపయోగించారు. ఇతర బ్యాటరీల మాదిరి దీనిన తరచూ రీఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఆటో చోక్

ఇందులో ఆటో చోక్‌ను ఉపయోగించారు. సాధారణ స్కూటర్ల మాదిరిగా వివిధ వాతావరణ పరిస్థితుల్లో స్కూటర్‌ను స్టార్ట్ చేసేందుకు చోక్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సులువు ఇంజన్ స్టార్ట్ అయ్యేందుకు సహకరిస్తుంది.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ - ఫీచర్లు

కలర్స్

బాజాజ్ క్రిస్టల్ స్కూటర్ కాక్‌టైల్ వైన్ రెడ్, జెట్ బ్లాక్, ఫ్రాన్సియా బ్లూ, ప్లాటినా సిల్వర్ అనే నాలుగు రంగుల్లో లభ్యం కానుంది.

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

బజాజ్ క్రిస్టల్ డిటిఎస్-ఐ

More from DriveSpark

Article Published On: Friday, January 11, 2013, 18:07 [IST]
English summary
Bajaj Auto is reportedly developing a new automatic scooter named as the Kristal. The Bajaj Kristal is not a new name. Bajaj had launched an automatic scooter named as Kristal way back in 2007.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+