బజాజ్-కెటిఎమ్ నుంచి మరిన్ని రేస్ బైక్‌లు
భారత ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో మరియు ఆస్ట్రియన్ ద్విచక్ర వాహన దిగ్గజం కెటిఎమ్‌లు భారత మార్కెట్లో మరిన్ని రేస్ బైక్‌లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. బజాజ్-కెటిఎమ్ వచ్చే ఏడాదిలో రెండు కొత్త ఆర్‌సి బ్రాండ్ ఫెయిర్డ్ రేసింగ్ బైక్‌లను 500సీసీ విభాగానికి దిగువన ప్రవేశపెడతామని బజాజ్ ప్రోబైకింగ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ నంది తెలిపారు.
ప్రస్తుతం బజాజ్-కెటిఎమ్ దేశీయ విపణిలో డ్యూక్ 200, డ్యూక్ 390 నేక్డ్ బైక్ (బాడీ ప్యానెల్స్ లేని)లను ఆఫర్ చేస్తుంది. కొత్తగా పూర్తీ బాడీ ప్యానెల్స్ (ఫుల్లీ ఫెయిర్డ్)తో కూడిన రేసింగ్ బైక్‌లను భారత్‌లో విడుదల చేసేందుకు ఈ జాయింట్ వెంచర్ సన్నాహాలు చేస్తుంది. అధిక వేగం వద్ద ఉత్తమ ఎరోడైనమిక్స్ కోసం ఈ రేసింగ్ బైక్‌లను ఇంజన్‌ను ముందు భాగం నుంచి ప్యానెల్స్‌తో కవర్ చేస్తారు.

గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్లో 8,000 కెటిఎమ్ బైక్‌లను విక్రయించామని, పూనే ప్లాంటులో ఉత్పత్తి అయిన దాదాపు 25,000 యూనిట్ల తక్కువ సీసీ కలిగిన కెటిఎమ్ బైక్‌లను యూరప్, లాటిన్ అమెరికా, దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతి చేశామని నంది చెప్పారు. ద్విచక్ర వాహన విభాగంలో రేసింగ్ బైక్‌ల అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రేసింగ్ విభాగంలో 10 శాతం వృద్ధిపై కంపెనీ దృష్టి సారించిందని నంది తెలిపారు. కెటిఎమ్ ఇటీవలే సరికొత్త రేస్ బైక్ 'కెటిఎమ్ ఆర్‌సి390 కప్' (KTM RC390 Cup)ను ఆవిష్కరించింది. కెటిఎమ్ ద్వారా నిర్వహించబడుతున్న 2014 ఏడిఏసి జూనియర్ కప్‌లో పాల్గొనేందుకు కంపెనీ ఈ కెటిఎమ్ ఆర్‌సి390 బైక్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇందులో ఓ ప్రొడక్షన్ వెర్షన్ రేసింగ్ బైక్ ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








