బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఇప్పుడు కొత్త రంగుల్లో..

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న లేటెస్ట్ మోటార్‌సైకిల్ 'పల్సర్ 200ఎన్ఎస్'లో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. ఈ మోడల్ ఇప్పుడు డ్యూయెల్ టోన్ కలర్స్ (రెండు రంగుల కలయిక)తో లభిస్తుంది. 'రెడ్ అండ్ బ్లాక్', 'వైట్ అండ్ బ్లాక్' ఫినిషింగ్స్‌తో కూడిన కొత్త పల్సర్ 200ఎన్ఎస్ బైక్‌లను బజాజ్ ఆటో విడుదల చేసింది.

ఇది వరకు బజాజ్ ఆటో తమ పల్సర్ 200ఎన్ఎస్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు ఇది చెర్రీ బ్లాక్, సఫైర్ బ్లూ, టొస్కా రెడ్, మస్టర్డ్ యల్లో అనే నాలుగు రంగుల్లో లభ్యమయ్యేది. ఇందులో కొత్త రెడ్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ కలర్లను చేర్చడంతో మొత్తం కలర్ ఆప్షన్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. కొత్త బైక్‌లలో కేవలం పెయింట్, బాడీ గ్రాఫిక్స్‌లలో మార్పులు తప్ప మరే మార్పులు లేవు.

మరిన్ని వివరాలను, ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

పల్సర్ 200ఎన్ఎస్ బైక్‌లో తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఫలితంగా, బైక్ పనితీరు అద్భుతంగా ఉండడమే కాకుండా ఇది తక్కువ కర్బన వ్యర్థాలను విడుదల చేస్తుంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను నడుపుతుంటే అసలైన స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న అనుభూతిని పొందుతున్నట్లు అనిపిస్తుంది. ఇంజన్ శబ్ధాన్ని తగ్గించేందుకు అంలేగే ఇంజన్ ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచేందుకు ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ బైక్‌‌లో ప్రపంచంలో మరెక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.52 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్

పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, November 18, 2013, 11:38 [IST]
English summary
Bajaj Pulsar 200NS is now available in two new dual-tone colors namely ‘Red and Black’ combo and ‘White and Black’ combo. There is no other changes in the bike apart from this new paint job.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+