బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఫ్యూయెల్ ఇంజెక్షన్‌తో..

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ మోడల్‌లో కంపెనీ ఓ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఈ కొత్త వేరియంట్ పల్సర్ 200ఎన్ఎస్ ఇండోనేషియా మార్కెట్లో విడుదల కానుంది.

వాస్తవానికి బజాజ్ ఆటో ఇప్పటికే ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఆప్షన్ కలిగిన పల్సర్ 200ఎన్ఎస్ మోడల్‌ను పశ్చిమ ఆసియా, తూర్పు యూరప్ మార్కెట్లలో విక్రయిస్తోంది. అయితే, ఇండియన్ మార్కెట్లో మాత్రం కంపెనీ వేరియంట్‌ను విక్రయించడం లేదు.

ఇండియన్ వెర్షన్ బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్‌లో కార్బురేటర్‌ను ఉఫయోగిస్తున్నారు. బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ఎఫ్ఐ (ఫ్యూయెల్ ఇంజెక్షన్) వేరియంట్‌లో కార్బురేటర్‌కు బదులుగా ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు.

Pulsar 200NS

ఇంజన్ పరంగా ఈ చిన్న మార్పు తప్పితే, ఈ రెండు వేరియంట్ల పెర్ఫార్మెన్స్‌లో పెద్ద మార్పు ఉండదు. ఇందులోని 199.5సీసీ, ఫోర్-వాల్వ్, ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ ఇంజన్ గరిష్టంగా 23 హెచ్‌పిల శక్తిని, 18 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సాధారణంగా టూవీలర్లలో కంపెనీలు కార్బురేటర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగించడం వలన బైక్ పెర్ఫార్మెన్స్ పెరగటంతో పాటు మైలేజ్ కూడా పెరుగుతుంది. ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ వలన ఇంజన్ జీవితకాలం పెరుగుతుంది మరియు దీని మెయింటినెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీటి ధరలు మాత్రం కార్బురేటర్ మోటార్‌సైకిళ్ల ధరల కన్నా ఎక్కువగా ఉంటాయి.

Most Read Articles

English summary
PT Kawasaki Motor Indonesia Deputy Head of Sales and Marketing, Dewi Setptianti has reportedly told Indonesian site Otonity.com that it would soon be introducing the fuel injected version of the Bajaj Pulsar 200NS in that country.
Story first published: Thursday, June 19, 2014, 12:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X