బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 విడుదల: ధరల వివరాలు

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తమ పల్సర్ బ్రాండ్‌లో 'పల్సర్ ఆర్ఎస్200' (Pulsar RS200) అనే సరికొత్త ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌ను కంపెనీ త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే.

కాగా.. కంపెనీ నేడు (మార్చ్ 26, 2015) తమ సరికొత్త 'బజాజ్ పల్సర్ ఆర్ఎస్200' బైక్‌ను భారత విపణిలో విడుదల చేసింది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అందులో స్టాండర్డ్ (నాన్ ఏబిఎస్ వెర్షన్) మరొకటి ఏబిఎస్ వెర్షన్.

bajaj pulsar rs 200 price and features

దేశీయ విపణిలో ఈ సరికొత్త పల్సర్ బైక్ ధరలు ఇలా ఉన్నాయి:

  • పల్సర్ ఆర్ఎస్200 (స్టాండర్డ్): రూ.1.18 లక్షలు
  • పల్సర్ ఆర్ఎస్200 (ఏబిఎస్): రూ.1.30 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆవిష్కరించిన 400సీసీ స్పోర్ట్స్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ సరికొత్త పల్సర్ 200ఆర్ఎస్‌ను తయారు చేశారు. ప్రస్తుతం బజాజ్ విక్రయిస్తున్న పల్సర్ బైక్‌లలో కెల్లా అత్యంత శక్తివంతమైన పల్సర్ బైక్ ఇదని కంపెనీ పేర్కొంది.

పల్సర్ ఆర్ఎస్200లో 199.5సీసీ, సింగిల్ సిలిండర్, 3-స్పార్క్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 23.2 బిహెచ్‌పిల శక్తిని, 1.9 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 26, 2015, 13:42 [IST]
English summary
The Bajaj RS200 has been launched in India today. This has been a much awaited launch for many Bajaj Pulsar enthusiasts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+