ఇండియాకు రానున్న 'బెనెల్లీ బిఎన్251' బైక్ ఆవిష్కరణ

ఇటాలియన్ బైక్ మేకర్ బెనెల్లీ, పూనేకి చెందిన డిఎస్‌కే హ్యోసంగ్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఇండియన్ మార్కెట్లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్న ఓ సరికొత్త బైక్‌ను మిలాన్‌లో జరుగుతున్న 2014 ఈఐసిఎమ్ఏ షోలో బెనెల్లీ ఆవిష్కరించింది.

ఈ బైక్ పేరు బెనెల్లీ బిఎన్251. త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. పేరుకు తగినట్లుగానే ఇదొక 250సీసీ నేక్డ్ స్ట్రీట్ బైక్. ఎక్స్‌పోస్డ్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ (రివర్సులో ఉండే ఫోర్క్స్), మోనోషాక్ రియర్ సస్పెన్షన్‌తో దీనిని తయారు చేశారు.

ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు; త్వరపడండి.. పరిమిత కాలపు ఆఫర్!

బెనెల్లీ బిఎన్251లో సింగిల్ సిలిండర్, 249సీసీ, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 24.5 పిఎస్‌ల శక్తిని, 21 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

Benelli BN 251

ఈ బైక్‌లో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 110/70-ZR17 సైజ్ టైర్‌ను మరియు వెనుక వైపు 140/60-ZR17 సైజ్ టైర్‌ను అమర్చారు. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు దీని సొంతం.

బెనెల్లీ తమ బిఎన్251 బైక్ ధరను, దానిని ఇండియాలో విడుదల చేసే తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఇది భారత్‌లో అమ్ముడుపోతున్న కెటిఎమ్ డ్యూక్ మోడళ్లతో నేరుగా పోటీ పడనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 6, 2014, 11:24 [IST]
English summary
The Benelli BN251, which is to go on sale in India soon, was unveiled at the EICMA 2014. Being the smallest motorcycle in the Benelli line up, it has a striking resemblance to the KTM Duke twins.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+