భాగ్ మిల్కా భాగ్ బుల్లెట్ బైక్‌ విన్నర్ హమినిన్దర్ సింగ్

By Ravi

స్టార్ డెరైక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ హీరోగా వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్' బాలీవుడ్ చిత్రం విజయాన్ని పురస్కరించుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్ 2 లెజెండ్స్ 1 ఒడిస్సీ (2 Legends 1 Odyssey) అనే పేరుతో ఓ కాంటెస్ట్‌ను నిర్వహించిన సంగతి తెలిసినదే. ఈ కాంటెస్ట్‌లో శ్రీనగర్‌కు చెందిన హమినిన్దర్ సింగ్ విజేతగా నిలిచాడు.

భాగ్ మిల్కా భాగ్ చిత్రంలో మిల్కా సింగ్ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నడిపిన రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్టోర్మ్ 500సీసీ మోటార్‌సైకిల్‌ను గెలుచుకున్నాడు. ఫర్హాన్ అక్తర్ సదరు బైక్ తాళం చెవులను స్వయంగా మహినిన్దర్ సింగ్‌కు అందజేశాడు.

‘ఫ్లయింగ్ సిక్కు'గా ప్రపంచానికి సుపరిచితుడైన స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథను అధారంగా చేసుకుని ‘భాగ్ మిల్కా భాగ్' చిత్రాన్ని రూపొందించారు. ఈ బాలీవుడ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయి దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

విన్నర్ హమినిన్దర్ సింగ్

విన్నర్ హమినిన్దర్ సింగ్

భాగ్ మిల్కా భాగ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ నిర్వహించిన కాంటెస్ట్‌లో శ్రీనగర్‌కు చెందిన హమినిన్దర్ సింగ్ విజేతగా నిలిచాడు. విజేతకు ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ నడిపిన రాయల్ ఎన్‌ఫీల్డ్ డెసెర్ట్ స్టోర్మ్ 500సీసీ మోటార్‌సైకిల్‌ తాళం చెవులను అందజేస్తున్న హీరో.

కాంటెస్ట్

కాంటెస్ట్

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే సభ్యులు ఈ సినిమాలో మిల్కా సింగ్ తమ జీవితంలో పోషించిన "పట్టుదల, అభిరుచి మరియు త్యాగాల"ను తెలిపే తమ స్వంత కథను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

బైక్‌తో హీరో ఫర్హాన్ అక్తర్

బైక్‌తో హీరో ఫర్హాన్ అక్తర్

రాయల్ ఎన్‌ఫీల్డ్ నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో విజేతను ప్రకటించేందుకు స్వయంగా ఆ చిత్ర హీరో ఫర్హాన్ అక్తర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఫొటోలకు ఫోజిలిస్తున్న హీరో.

భాగ్ మిల్కా భాగ్ స్టోరీ

భాగ్ మిల్కా భాగ్ స్టోరీ

దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో కుటుంబాన్ని కోల్పోయిన మిల్కా సింగ్ అనే పిల్లవాడు ప్రాణాలను రక్షించుకోవడానికి ఢిల్లీకి చేరుకుని, ఆ తర్వాత సైన్యంలో జవాన్‌గా చేరి ఓ సూపర్ స్టార్ అథ్లెట్‌గా ఎలా మారుతాడు? అతని జీవితంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాడు? అనేక ఒడిదుడుకుల మధ్య తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అనేది వెండితెర మీద చూడాల్సిందే.

చిత్రంలో సన్నివేశం

చిత్రంలో సన్నివేశం

భాగ్ మిల్కా భాగ్ చిత్రంలో మిల్కా సింగ్ పాత్ర పోషించిన ఫర్హాన్ అక్తర్ ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.

More from DriveSpark

Article Published On: Friday, July 26, 2013, 18:02 [IST]
English summary
Royal Enfield and Farhan Akhtar together celebrated the success of Bhaag Milkah Bhaag and launched a contest to celebrate this epic film. The contest has now drawn to a close, with winner Hamininder Singh from Srinagar receiving the keys to this prized motorcycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+