బజాజ్ పల్సర్ పెర్ఫామెన్స్ వెర్షన్ చిత్రాలు లీక్!
దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో పెద్ద ఇంజన్‌తో కూడిన ఓ సరికొత్త పల్సర్ బైక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. స్పోర్ట్స్ బైక్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని 300సీసీ ఎగువన ఓ పెర్ఫామెన్స్ బైక్‌ను బజాజ్ ఆటో అభివృద్ధి చేస్తోంది. ఆస్ట్రియాకు చెందిన తమ భాగస్వామి కెటిఎమ్‌తో కలిసి ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, సరికొత్త పెర్ఫామెన్స్ వెర్షన్ బజాజ్ పల్సర్ బైక్‌కు సంబంధించిన స్పైచిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.
ఈ కొత్త బజాజ్ పల్సర్‌లో 375సీసీ లేదా 390సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన పల్సర్ 200ఎన్ఎస్ బైక్ డిఎన్ఏ ఇందులో కనిపించే అవకాశం ఉంది. సరికొత్త ఫ్రంట్ డిజైన్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షనీయమైన బాడీ ప్యానెల్స్, స్ప్లిట్ సీట్, డిజిటల్ మరియు అనలాగ్ కాంబినేషన్ మీటర్ కన్సోల్, ముందువైపు టెలిస్కోపిక్ వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్స్, వెడల్పాటి వెనుక టైర్, ముందు వెనుక డిస్క్ బ్రేక్స్ (ఏబిఎస్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది)ను గమనించవచ్చు.
ఇదిలా ఉండగా, బజాజ్ ఆటో అధినేత రాజీవ్ బజాజ్ ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలోనే ఆరు కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తామని చెప్పారు. అందులో రెండు పల్సర్ బ్రాండ్ బైక్‌లు, నాలుగు డిస్కవరీ బ్రాండ్ బైక్‌లు ఉంటాయని ఆయన చెప్పారు. రెండు పల్సర్ బైక్‌లలో ఒకటి కంపెనీ అందిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ కన్నా దిగువన ప్రవేశపెట్టనుండగా మరొకటి ఈ బైక్‌కు ఎగువన ప్రవేశపెట్టనున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే పల్సర్ 150లో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్ మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

బజాజ్ పల్సర్ పెర్ఫామెన్స్ వెర్షన్

బజాజ్ పల్సర్ పెర్ఫామెన్స్ వెర్షన్
పెద్ద పల్సర్ స్పై షాట్

బజాజ్ పల్సర్ పెర్ఫామెన్స్ వెర్షన్
పెద్ద పల్సర్ స్పై షాట్

బజాజ్ పల్సర్
ప్రస్తుతం బజాజ్ అందిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తక్కువ సీసీ కలిగిన ఓ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.

బజాజ్ పల్సర్
ప్రస్తుతం బజాజ్ అందిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తక్కువ సీసీ కలిగిన ఓ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.

బజాజ్ పల్సర్
బజాజ్ పల్సర్ స్కెచ్
Source: Autocar India


Click it and Unblock the Notifications








