వికటించిన రికార్డ్ ఫీట్: యాక్సిడెంట్‌లో 'బిల్ వార్నర్' మృతి

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంతో ద్విచక్ర వాహనాన్ని నడిపి రికార్డు సృష్టించిన, ఫ్లోరిడాకు చెందిన బిల్ వార్నర్ (Bill Warner) ఇకలేరు. వేగం అంటే ఇష్టపడే వార్నర్ అదే వేగానికి బలయ్యాడు. గతంలో (జులై 2011లో) అతను 1299 సీసీ ఇంజన్ కలిగిన ఓ టర్బోఛార్జ్‌డ్ హయబుసా మోటార్‌సైకిల్‌‌ను గంటకు గరిష్టంగా 502 కిలోమీటర్ల (గంటకు 311.945 మైళ్ల) వేగంతో నడిపి ఓ సరికొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసినదే.

తాజాగా, లైమ్‌స్టోన్, మైన్‌లోని లోరింగ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో కూడా ఇదే తరహాలో అతను (44 ఏళ్లు) గంటకు 300 మైళ్లు (సుమారు 482 కిలోమీటర్లు) వేగాన్ని అందుకునే ప్రయత్నంలో దురదృష్టవశాత్తు బైక్ అదుపు తప్పి, క్రింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో వార్నర్ తీవ్రంగా గాయపడినప్పటికీ అతను స్పృహలోనే ఉన్నాడని, కానీ, ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందాడని రేస్ డైరెక్టర్ టిమ్ కెల్లీ ప్రకటించాడు.

గడచిన 2010లో 'స్ట్రీమ్‌లైనర్' మోటార్‌సైకిల్స్ గంటకు గరిష్టంగా 448.36 కిలోమీటర్ల (గంటకు 278.6 మైళ్ల) వేగంతో ప్రయాణించి రికార్డును నెలకొల్పగా ఆ రికార్డ్‌ను వార్నర్ అధిగమించి, 2011లో గంటకు 502 కిలోమీటర్ల (గంటకు 311.945 మైళ్ల) వేగంతో ప్రయాణించి ఓ సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే, ఈ రికార్డు అధికారికంగా గుర్తింపు పొందలేదు.

దీంతో గుర్తింపు కోసం మరోసారి వార్నర్ చేసిన ప్రయత్నం వికటించింది. ప్రమాదం జరిగే సమయానికి వార్నర్ ఎంత వేగంతో వెళుతున్నాడన్నది ఇంకా తెలియలేదు. అయితే, అంతకు కొద్ది సేపటి ముందు అతను 285 మైళ్ల వేగాన్ని అందుకున్నట్టు స్పీడోమీడర్‌లో నమోదైంది.

జూలై 2011లో ఈ రికార్డు సృష్టించిన సందర్భంగా వార్నర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. "బైక్‌ను 502 కి.మీ. వేగానికి తీసుకువెళ్లడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే, అంత వేగంలో వెళ్లే బైక్‌ వేగాన్ని తగ్గించడమే పెద్ద కష్టం, ఇది పూర్తిగా ఆగిపోయే లోపలే నేను రన్‌వే దాటి వెళ్లిపోయాన"ని అప్పట్లో అన్నారు.
"వేగం కన్నా ప్రాణం మిన్న"

బిల్ వార్నర్ (ఫైల్ ఫొటో)

బిల్ వార్నర్ (ఫైల్ ఫొటో)

చివరి స్లైడ్‌లో యాక్సిడెంట్ వీడియోని వీక్షించండి.

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్

బిల్ వార్నర్ యాక్సిడెంట్ (వీడియో)

More from DriveSpark

Article Published On: Tuesday, July 16, 2013, 14:54 [IST]
English summary
Bill Warner died on Sunday after losing control and zooming off a runway while trying to break his speed record at Loring Air Force Base in Limestone, Maine. Bill Warner (44), a resident of Florida, USA has set a new speed record while riding a turbocharged Suzuki Hayabusa in July 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+