అత్యంత ఖరీదైన సైకిల్ 'లాంబోర్గినీ ఇంపెక్'
ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ ఇటీవల ముగిసిన 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో తమ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ సూపర్ కారు 'లాంబోర్గినీ వెనెనో ఎల్‌పి 750-4'ను విడుదల చేయటం ద్వారా కంపెనీ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసినదే. ఇలాంటివి కేవలం మూడు కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేసింది. దీని ధర 30 లక్షల యూరోలు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.21.4 కోట్లకు పైమాటే (అదీ పన్నులు కలుపుకోకుండా).
అయితే, ఇంత ఖర్చు పెట్టి ఈ కారును కొనుక్కోలేని వారు కేవలం 32,000 డాలర్లు చెల్లించి ఓ స్పెషల్ ఎడిషన్ లాంబోర్గినీ సైకిల్‌ను సొంతం చేసుకోవచ్చు. లాంబోర్గిన తన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, స్విట్జర్లాండ్‌కు చెందిన రేసింగ్ సైకిళ్ల తయారీ కంపెనీ బిఎమ్‌సితో చేతులు కలిపి 'లాంబోర్గినీ ఇంపెక్' అనే ఓ లిమిటెడ్ ఎడిషన్ సైకిల్‌ను తయారు చేసింది.
50 ఏళ్లను గుర్తు చేసేలా ఇవి కూడా 50 సైకిళ్లు మాత్రమే ఉత్పత్తికానున్నాయి. ఈ సైకిల్ ధర 32,000 డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.17.35 లక్షలు. లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్‌ను పూర్తిగా కార్బన్ ఫైబర్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఈ సైకిల్ కేవలం పసుపు రంగులో మాత్రమే లభిస్తుంది. ఇది చూడటానికి గతంలో కంపెనీ విడుదల చేసిన లాంబో ఆరెంజ్ స్పెషల్ ఎడిషన్ ఇంపెక్ సైకిల్ (అప్పట్లో ఇవి 30 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.) మాదిరిగానే ఉంటుంది. మరి ఈ కాస్ట్రీ సైకిల్‌పై ఓ కన్నేస్కోండి..!

లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్

లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్

లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్

లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్

లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్

లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్

లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్

లాంబోర్గినీ ఇంపెక్ సైకిల్



Click it and Unblock the Notifications








