మోటార్‌సైకిల్ రైడర్ల కోసం ఎయిర్‌బ్యాగ్ జాకెట్స్

By Ravi

ఇప్పటి వరకు కార్లకు మాత్రమే పరిమితమైన ఎయిర్‌బ్యాగ్‌లు ఇప్పుడు ద్విచక్ర వాహన చాలకులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. నాలుగు చక్రాల వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్‌లను స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్ వంటి ప్రాంతాల్లో అమర్చుతారు. అయితే, బైకర్ల కోసం తయారు చేసిన ఈ ఎయిర్‌బ్యాగ్‌లను వారు ధరించే జాకెట్‌లో అమర్చుతారు.

ఈ జాకెట్ ధరించే బైక్ నడిపే రైడర్ ప్రమాదవశాత్తు క్రిందపడిపోతే సెకండ్ల వ్యవధిలోనే ఈ ఎయి‌ర్‌బ్యాగ్ విచ్చుకొని శరీరంలో అత్యంత కీలక భాగాలైన మెడ, భుజాలు, వెన్నెముకకు రక్షణ కల్పిస్తాయి. ఇప్పటికే ఈ తరహా ఉత్పత్తులను పలు సంస్థలు అభివృద్ధి చేయటం జరిగింది. అయితే, ఇవి సామాన్యులకు కనుచూపు మేరలో కూడా అందుబాటులో లేవు.

ఈ నేపథ్యంలో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్, డైనెసె సంస్థలు ఓ ఎయిర్‌బ్యాగ్ జాకెట్‌‌ను అభివృద్ధి చేసేందుకు చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఓ ఒప్పందం కుదింరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు సంస్థలు పలురాకల సేఫ్టీ ఉత్పత్తులను అభివృద్ధి చేయనున్నాయి. ఈ రెండు సంస్థల నుంచి మొదటిగా వచ్చిన ఉత్పత్తే ఈ మోటార్‌సైకిల్ ఎయిర్‌బ్యాగ్ జాకెట్.

మరి ఈ మోటార్‌సైకిల్ ఎయిర్‌బ్యాగ్ జాకెట్ విశేషాలేంటో, ఇదెలా పనిచేస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

డి-ఎయిర్ సిస్టమ్

డి-ఎయిర్ సిస్టమ్

డైనెసె అందిస్తున్న డి-ఎయిర్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త మోటార్‌సైకిల్ ఎయిర్‌బ్యాగ్ జాకెట్‌ను రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ డి-ఎయిర్ సిస్టమ్‌ను మోటోజిపి రైడర్లు, ఉతర రేస్ డ్రైవర్లు ఉపయోగిస్తున్నారు.

15 మిల్లీ సెకండ్లు

15 మిల్లీ సెకండ్లు

ప్రమాదం జరిగిన 15 మిల్లీ సెకండ్లలోనే ఈ ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకుంటాయి.

ఈఐసిఎమ్ఏలో విడుదల

ఈఐసిఎమ్ఏలో విడుదల

కొత్త బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ బ్రాండెడ్ సింగిల్ పీస్ లెథర్ రేసింగ్ సూట్‌ను 'డబుల్ఆర్ రేస్ఎయిర్' అని పిలువనున్నారు. దీనిని ఈ ఏడాది నవంబర్‌లో మిలాన్‌లో జరగనున్న ఈఐసిఎమ్ఏలో తొలిసారిగా ప్రదర్శించనున్నారు.

ఉత్పత్తి

ఉత్పత్తి

2015లో దీని ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇందుకు కావల్సిన క్రాష్, సేఫ్టీ టెస్టులు ఇప్పటికే పూర్తయ్యాయి.

1976లోనే ఆవిష్కరణ

1976లోనే ఆవిష్కరణ

మోటార్‌సైకిల్ ఎయిర్‌బ్యాగ్‌ను తొలిసారిగా 1976లోనే ఆవిష్కరించారు. హంగేరియాకు చెందిన థామస్ స్ట్రౌబ్ అనే వ్యక్తి 1976లో మోటార్‌సైకిల్ ఎయిర్‌బ్యాగ్‌ను తొలిసారిగా ఆవిష్కరించాడు.

డైనెసె డి-ఎయిర్ ప్రొటెక్షన్ సిస్టమ్ (వీడియో)

డైనెసె డి-ఎయిర్ ప్రొటెక్షన్ సిస్టమ్ (వీడియో)

Most Read Articles

English summary
Airbags are the most common safety feature in cars, next only to seat belts. But not everyone would be aware of the existence airbags for motorcycle riders. Yes, they do exist and most of these come as part of a riding jacket. However, the most advanced motorcycle jacket airbags are used by professional motorcycle racers and these high tech safety gears are not easily available to the common biker.
Story first published: Tuesday, July 23, 2013, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X