బడ్జెట్ ఎఫెక్ట్: బ్రాండెడ్ పెట్రోల్‌పై లీటరుకు రూ.5 తగ్గింపు
కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బిజెపి సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ పట్ల చాలా వరకు హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బ్రాండెడ్ లేదా ప్రీమియం పెట్రోలుపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో సదరు బ్రాండెడ్ లేదా ప్రీమియం పెట్రోల్ ధరను కూడా తగ్గించారు.
తాజా బడ్జెట్‌లో బ్రాండెడ్ లేదా ప్రీమియం పెట్రోలుపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటరుపై రూ.7.50 నుంచి రూ.2.35కు తగ్గించారు. దీంతో బ్రాండెడ్ లేదా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5కి తగ్గించారు.
వాహనాల పెర్ఫార్మెన్స్‌ను పెంచే ప్రత్యేక మూలకాలు ఈ బ్రాండెడ్ పెట్రోల్‌లో ఉంటాయి. ఈ బ్రాండెడ్ పెట్రోల్‌పై సాధారణ పెట్రోల్ కన్నా అధిక డ్యూటీలను చార్జ్ చేస్తారు. హైపెర్ఫార్మెన్స్ బైక్స్, సూపర్‌బైక్స్, సూపర్‌కార్లలో ఇలాంటి బ్రాండెడ్ పెట్రోల్‌ను ఉపయోగిస్తుంటారు.

గతంలో, సాధారణ పెట్రోల్ మరియు ప్రీమియం పెట్రోల్ మధ్య ఉన్న ఎక్సైజ్ డ్యూటీ వ్యత్యాసం కారణంగా, ఈ రెండు రకాల పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసం ఏర్పడింది. దీంతో బ్రాండెడ్ పెట్రోల్ అమ్మకాలు చాలా వరకు క్షీణించాయి.
కాగా.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో ధరలు కొంత మేర తగ్గి, తిరిగి ఈ పెట్రోల్ అమ్మకాలు పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో బిపిసిఎల్ విక్రయిస్తున్న ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు 83.03గా ఉంటే సాధారణ పెట్రోల్ ధర లీటరుకు రూ.73.55గా ఉంది.


Click it and Unblock the Notifications








