స్టార్ట్-స్టాప్ డ్రైవింగ్ కోసం క్యాస్ట్రాల్ నుంచి సరికొత్త ఇంజన్ ఆయిల్
ప్రపంచపు అగ్రగామి ఇంజన్ ఆయిల్ తయారీ సంస్థల్లో ఒకటైన క్యాస్ట్రాల్, నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లపై తిరిగే వాహనాల్లోని ఇంజన్ పరిరక్షణ కోసం ఓ సరికొత్త ఇంజన్ ఆయిల్‌ను విడుదల చేసింది. 'క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్' (Castrol MAGNATEC STOP-START) పేరిట స్టాప్-స్టార్ట్ డ్రైవింగ్ వలన ఇంజన్ లోపల జరిగే నష్టాన్ని నివారించేందుకు ఓ కొత్త ఇంజన్ ఆయిల్‌ను పరిచయం చేసింది.
పిల్లను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు, షాపులకు వెళ్లేటప్పుడు, లేదా రద్దీగా ఉండే రోడ్లపై ప్రధాన కూడళ్లలో ఇంజన్‌ను ఆన్-ఆఫ్ చేస్తూ డ్రైవ్ చేసేటప్పుడు ఇంజన్‌పై అదనపు భారం పడకుండా, లోపలి భాగాలు దెబ్బతినకుండా ఉండేలా ఈ కొత్త క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్ సహకరిస్తుందని కంపెనీ వివరించింది.

వాహనాన్ని తరచూ ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ డ్రైవ్ చేయటవం వలన ఇంజన్‌లో కలిగే డ్యామేజ్‌ను నివారించేలా క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్‌ను అభివృద్ధి చేశామని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక క్యాస్ట్రాల్ టెక్నాలజీ సెంటర్లలోని ఇంజనీర్లు, శాస్త్రవేత్తల అభివృద్ధి ఫలమే ఈ క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్ అని కంపెనీ తెలిపింది.
క్యాస్ట్రాల్ మాగ్నటిక్ స్టాప్-స్టార్ట్ ఇంజన్ ఆయిల్ లోని ఇంటెలిజెంట్ మాలిక్యూల్స్ ఇంజన్‌లోని కీలక భాగాలను అంటిపెట్టుకొని ఉండి, ఓ సెల్ఫ్-హీలింగ్ లేయర్‌ను ఏర్పాటు చేస్తాయని, ఒకవేళ ఇంజన్ రన్నింగ్‌లో కొన్ని మాలిక్యూల్స్ తొలగిపోయినా ఇతర మాలిక్యూల్స్ ఓ ప్రొటెక్టివ్ లేయర్‌ను ఏర్పాటు చేసేందుకు సహకరిస్తాయని క్యాస్ట్రాల్ వివరించింది.


Click it and Unblock the Notifications








