160సీసీ యునికార్న్ బైక్‌ని విడుదల చేయనున్న హోండా
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అందిస్తున్న యునికార్న్ బ్రాండ్‌లో మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 150సీసీ వేరియంట్ యునికార్న్ కన్నా మరింత శక్తివంతమైన 160సీసీ యునికార్న్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే హోండా యునికార్న్ 160సీసీ బైక్ డీలర్‌షిప్‌ల వద్దకు చేరిపోయినట్లు తెలుస్తోంది. హోండా అధీకృత టూవీలర్ డీలర్లు ఇప్పటికే ఈ కొత్త యునికార్న్ బైక్ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించినట్లు సమాచారం. డిల్లీ మార్కెట్లో దీని ధరను రూ.63,695లుగా నిర్ణయించారు.
అంటే, హోండా యునికార్న్ 160 ఆన్-రోడ్ ధర సుమారు 70,000 వరకూ ఉండొచ్చని అంచనా. ప్రస్తుత యునికార్న్ 150తో పోల్చుకుంటే కొత్త యునికార్న్ 160 మరింత మోడ్రన్ డిజైన్‌ని కలిగి ఉండనుంది. కంపెనీ విక్రయిస్తున్న హోండా సిబి ట్రిగ్గర్ డిజైన్, కాంపోనెంట్స్‌ను ఈ కొత్త యునికార్న్ 160లో షేర్ చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications








