త్వరలో విడుదల: కెటిఎమ్ ఆర్‌సి 200, కెటిఎమ్ ఆర్‌సి 390
ఇప్పటి వరకు భారత్‌లో డ్యూక్ (Duke) సిరీస్ బైక్‌లను విక్రయిస్తున్న ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్, ఇకపై ఆర్‌సి (RC) సిరీస్ బైక్‌లను కూడా విక్రయించనుంది. ప్రస్తుతం కెటిఎమ్ భారత మార్కెట్లో డ్యూక్ 200, డ్యూక్ 390 మోడళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే.
అయితే, ఇవి రెండు డ్యూక్ బైక్‌లు కూడా నేక్డ్ స్ట్రీట్ బైక్‌లే (ఫుల్ బాడ్ ప్యానెల్స్ లేని బైక్‌లు). ఈ నేపథ్యంలో, కెటిఎమ్ వీటికి ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్లను (పూర్తి బాడీ ప్యానెల్స్ కలిగిన బైక్స్‌ను) ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే, కంపెనీ ఆర్‌సి 200 మరియు ఆర్‌సి 390 మోడళ్లను మరికొద్ది నెలల్లోనే భారత్‌లో విడుదల చేయనుంది. ఈ రెండింటినీ డ్యూక్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌లను ఆధారంగా చేసుకొనే తయారు చేయనున్నారు.
వాస్తవానికి డ్యూక్ 200, డ్యూక్ 390 బైక్‌లలో ఉపయోగించిన ఇంజన్లనే కాస్తంత రీట్యూన్ చేసి, ఈ కొత్త ఆర్‌సి 200 మరియు ఆర్‌సి 390 బైక్‌లో ఉపయోగించనున్నారు. ఇవి రెండూ డ్యూక్ సిరీస్ బైక్‌ల కన్నా మరింత స్పోర్టీగా అనిపిస్తాయి.

ఈ ఆర్‌సి సిరీస్ బైక్‌లలో ఫైనల్ డ్రైవ్ రేషియో మరియు ఈసియూ లలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ మార్పుల వలన ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్‌లలోని ఇంజన్లు మరింత ఎక్కువ పవర్‌ను డెలివరీ చేసే అవకాశం ఉంటుంది.
మార్కెట్ వర్గాల సమచారం ప్రకారం, ఈ కొత్త కెటిఎమ్ ఆర్‌సి సిరీస్ బైక్‌లు 2014 ద్వితీయార్థంలో, పండుగ సీజన్ ప్రారంభం కావటానికి మునుపే మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








