జనవరి 2015లో సుజుకి స్విష్ ఫేస్‌లిఫ్ట్ స్కూటర్ విడుదల
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'స్విష్ 125' (Swish) స్కూటర్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ కానున్న కొత్త సుజుకి స్విష్ ఈ జనవరిలో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.
సుజుకి స్విష్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ స్కూటర్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. హోండా డియో, యమహా రే జెడ్ స్కూటర్ల మాదిరిగా యూత్‌ఫుల్ అప్పీల్‌ని కలిగి ఉండేలా సుజుకి తమ కొత్త స్విష్‌ను డిజైన్ చేయనుంది.

కొత్త 2015 సుజుకి స్విష్ 125సీసీ స్కూటర్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ప్రస్తుత స్విష్ స్కూటర్‌లో ఉపయోగిస్తున్న 124సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.58 హార్స్ పవర్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. కొత్త సుజుకి స్విష్ ఆన్-రోడ్ ధర రూ.60,000 లకు పైగా ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








