మోటార్‌సైకిళ్ల కోసం కాంటినెంటల్ కార్నరింగ్ ఏబిఎస్ సిస్టమ్
కార్లలో మాదిరిగానే మోటార్‌సైకిళ్లలో కూడా ద్విచక్ర వాహనా తయారీదారులు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. గ్లోబల్ మార్కెట్లలో దాదాపు అన్ని మోటార్‌సైకిళ్లు, కార్లలో ఏబఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేస్తున్నారు.
ప్రముఖ ఆటోమొబైల్ టెక్నాలజీ కంపెనీ కాంటిమెంటల్, మోటార్‌సైకిళ్ల కోసం మరింత అధునాతనమైన ఏబిఎస్ టెక్నాలజీని పరిచయం చేసింది. కార్నరింగ్ ఏబిఎస్ సిస్టమ్ పేరిట కాంటినెంటల్ ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ మలుపుల వద్ద సైతం మంచి బ్రేకింగ్‌ను ఆఫర్ చేస్తుంది.
కాంటినెంటల్ ఆప్టిమైజ్డ్ కర్వ్ బ్రేకింగ్ సిస్టమ్ మోటార్‌సైకిల్ యొక్క రోల్, పిచ్, యాక్సిలరేషన్, లీన్ యాంగిల్ వంటి అంశాలను అంచనా వేసుకొని, మలుపు వద్ద ఉత్తమ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, షార్ప్ కర్వ్స్ వద్ద బ్రేక్ అప్లయ్ చేసినప్పుడు టైరు పక్కకు తిరిగిపోకుండా, అది ప్రయాణిస్తున్న దిశ, కోణంలోనే ఆగేందుకు ఈ సిస్టమ్ సహకరిస్తుంది.

ఈ కాంటినెంటల్ కార్నరింగ్ ఏబిఎస్ సిస్టమ్‌ను తొలిసారిగా బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఎక్స్ఆర్‌లో ఉపయోగించనున్నారు. అంతేకాదు, మోటార్‌సైకిల్‌లో ఈ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్న మొట్టమొదటి కంపెనీ కూడా బిఎమ్‌డబ్ల్యూనే కావటం విశేషం. భవిష్యత్తులో మరిన్ని బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిళ్లలో ఈ కార్నరింగ్ ఏబిఎస్ సిస్టమ్‌ను ఆఫర్ చేయనున్నారు.
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ బోష్ కూడా ఇదే తరహా కార్నరింగ్ ఏబిఎస్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తోంది. కెటిఎమ్ అందిస్తున్న 1290 సూపర్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో బోష్ కార్నరింగ్ ఏబిఎస్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications








