హోండా డ్రీమ్ యుగ బైక్‌లో హోండా ఈకో టెక్నాలజీ
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన 100సీసీ బైక్ 'డ్రీమ్ యుగ'లో రిఫ్రెష్డ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. హోండా తాజాగా రిఫ్రెష్ చేసి, మార్కెట్లోకి విడుదల చేసిన స్కూటర్లలో ఉపయోగించిన హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి)ని ఈ రిఫ్రెష్డ్ 2013 డ్రీమ్ యుగ మోటార్‌సైకిల్‌లో కూడా ఉపయోగించింది.
ఇందులో కొత్త హోండా ఈకో టెక్నాలజీని ఉపయోగించడం వలన దీని మైలేజ్ మరింత పెరగినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త 2013 హోండా డ్రీమ్ యుగ మోటార్‌సైకిల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి వెర్షన్ లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, ఈకొత్త వెర్షన్ లీటరుకు 74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ అప్‌గ్రేడెడ్ 2013 హోండా డ్రీమ్ యుగ ధరలో కూడా ఎలాంటి మార్పుల లేదు. పాత ధరకే ఇది లభ్యమవుతుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.45,101 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
హోండా బడ్జెట్ బైక్ డ్రీమ్ యుగలో ఉపయోగించిన 110సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది మూడు వేరియంట్ల (కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + స్పోక్ వీల్స్, కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్, సెల్ఫ్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్)లో ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (బ్లాక్, మాన్‌సూన్ గ్రే మెటాలిక్, ఆల్ఫా రెడ్ మెటాలిక్, ఫోర్స్ సిల్వర్ మెటాలిక్, మ్యాపల్ బ్రౌన్ మెటాలిక్) లభ్యమవుతుంది.

ఎరోడైనమిక్ ఫ్రంట్ కౌల్:
ముందువైపు డిజైన్ చేయబడిన హెడ్‌లైట్ డోమ్ బైక్‌కు మంచి లుక్‌నివ్వటమే కాకుండా, మంచి రైడ్ హ్యాండ్లింగ్‌ను కూడా అందిస్తుంది.

స్టయిలిష్ గ్రాబ్ రెయిల్:
బైక్ వెనుక వైపు బ్రేక్ లైట్ పైభాగంలో అమర్చబడిన బాడీ కలర్‌లో ఉండే గ్రాబ్ రెయిల్ అల్యూమినియంతో చేయబడినది. ఇది తక్కువ బరువును కలిగి ఉంటడమే కాకుండా పటిష్టంగా కూడా ఉంటుంది.

ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్:
ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ కౌల్ (ప్యానెల్స్)పై డిజైన్ చేయబడిన స్టయిలిష్ గ్రాఫిక్స్ ఇతరల దృష్టిని మరోసారి మీ బైక్‌వైపుకు తిప్పుకునేలా చేస్తుంది.

విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్:
దీర్ఘకాలం మన్నిక కలిగిన విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్ ఉండటం వలన దీనిని తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు.

ఫైవ్-స్టెప్ అడ్జస్టబల్ రియర్ సస్పెన్షన్:
ఈ బైక్‌కు వెనుక వైపు అమర్చబడిన 5-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్‌ను రోడ్డు, లోడ్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. 94 మి.మీ. పొడవు ఉండే ఈ సస్పెన్షన్ వలన ఎలాంటి రోడ్లపై అయినా సరే స్మూత్ రైడ్ అనుభూతిని పొందవచ్చు.

ఫ్రంట్ సస్పెన్షన్:
ముందు వైపు అమర్చిన 120మి.మీ. షాక్ అబ్జార్వర్లు రైడర్‌కు కంఫర్ట్ రైడ్ అనుభూతిని కలిగిస్తాయి.

11సీసీ ఇంజన్:
హోండా ఇంటలిజెంట్ ఇగ్నిషన్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన రీడిఫైన్డ్ 110సీసీ ఇంజన్ సూపర్ పవర్‌ను, టార్క్‌ను విడుదల చేసి మంచి యాక్సిలరేషన్‌ను అందిస్తుంది.

ట్యూబ్‌లెస్ టైర్లు:
హోండా డ్రీమ్ యుగ ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. టైరుకు చిన్న చిన్న పంక్చర్లు జరిగినప్పుడు టైరులోని గాలి మొత్తం బయటు వెళ్లిపోకుండా ఈ ట్యూబ్‌లెస్ టైర్లు సహకరిస్తాయి.

ధర
రూ.45,101 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








