డిఎస్‌కె బెనెల్లీ బైక్స్ కోసం బుకింగ్స్ షురూ; మార్చ్ 19న విడుదల

By Ravi

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ, గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో పూనేకి చెందిన డిఎస్‌కె మోటోవీల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని భారత మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసినదే. ఇటీవలే గోవాలో జరిగిన 3వ ఎడిషన్ ఇండియా బైక్ 2015లో కూడా డిఎస్‌కె-బెనెల్లీ తమ మోటార్‌సైకిళ్లను ప్రదర్శనకు ఉంచింది.

మార్చ్ 19, 2015వ తేదీన తమ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు బెనెల్లీ పేర్కొంది. ఈ నేపథ్యంలో, డిఎస్‌కె-బెనెల్లీ తమ మోటార్‌సైకిళ్ల కోసం మార్చ్ 10వ తేదీ నుంచే బుకింగ్స్ ప్రారంభించింది. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన డిఎస్‌కె-బెనెల్లీ షోరూమ్‌ల ద్వారా ఈ బైక్స్‌ని బుక్ చేసుకోవచ్చు.

DSK Benelli

ప్రస్తుతం డిఎస్‌కె-బెనెల్లీకి అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, హైదరాబాద్, కలకత్తా, ముంబై, పూనే నగరాల్లో షోరూమ్‌లు/డీలర్‌షిప్‌లు ఉన్నాయి. డిఎస్‌కె-బెనెల్లీ ముందుగా ఐదు మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. ఆ తర్వాత మరో మూడు మోడళ్లను 2015 చివరి నాటికి విడుదల చేస్తుంది.

డిఎస్‌కె-బెనెల్లీ నుంచి ముందుగా టిఎన్‌టి 302, టిఎన్‌టి 600ఐ, టిఎన్‌టి 600 జిటి, టిఎన్‌టి 899 మరియు టిఎన్‌టి 1130 ఆర్ మోడళ్లు విడుదల కానున్నాయి. వీటి తర్వాత టిఎన్‌టి 25, టిఎన్‌టి 1130 ట్రెక్ అమేజానస్ మరియు కీవే బ్లాక్‌స్టర్ మోడళ్లు విడుదల అవుతాయి. సరమైన ధరకే ఈ బైక్స్‌ని అందించేందుకు గాను వీటిని స్థానికంగా అసెంబ్లింగ్ చేయనున్నారు.

Benelli IBW

డిఎస్‌కె-బెనెల్లీ షోరూమ్ కాంటాక్ట్ నెంబర్స్:
  • డిఎస్‌కె-బెనెల్లీ అహ్మదాబాద్ షోరూమ్ :+91 800070090
  • డిఎస్‌కె-బెనెల్లీ బెంగుళూరు షోరూమ్ :+91 9591073333
  • డిఎస్‌కె-బెనెల్లీ చెన్నై షోరూమ్ :+91 9176626655
  • డిఎస్‌కె-బెనెల్లీ ఢిల్లీ షోరూమ్ :+91 8588847598
  • డిఎస్‌కె-బెనెల్లీ గోవా షోరూమ్ :+91 9422443287
  • డిఎస్‌కె-బెనెల్లీ హైదరాబాద్ షోరూమ్ :+91 9885004004
  • డిఎస్‌కె-బెనెల్లీ కోల్‌కటా షోరూమ్ :+91 9831639393
  • డిఎస్‌కె-బెనెల్లీ ముంబై షోరూమ్ :+91 8082059999
  • డిఎస్‌కె-బెనెల్లీ పూనే షోరూమ్ :+91 7030955220

More from DriveSpark

Article Published On: Thursday, March 12, 2015, 11:24 [IST]
English summary
DSK-Benelli has decided to commence bookings for its super bikes from 10th March, 2015 onwards. Customers can currently book their desired motorcycle from nine dealerships spread across India. Showrooms are currently present in Ahmedabad, Bengaluru, Chennai, Delhi, Goa, Hyderabad, Kolkata, Mumbai and Pune.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+