2015 ఇండియా బైక్ వీక్‌లో సందడి చేయనున్న బెనెల్లీ బైక్స్
ఇటలీకి చెందిన లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బెనెల్లీ (Benelli), గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో పూనేకి చెందిన డిఎస్‌కె మోటోవీల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించిన సంగతి తెలిసినదే. డిఎస్‌కే-బెనెలీ జాయింట్ వెంచర్ ఏర్పడి నాలుగు నెలలు పూర్తయినప్పటికీ, ఇంకా బెనెల్లీ ఉత్పత్తులు మాత్రం మార్కెట్లో విడుదల కాలేదు.
ఈ నేపథ్యంలో.. బైకర్ల పండుగైన 'ఇండియా బైక్ వీక్ 2015'లో తమ ఉత్పత్తులన్నింటినీ ప్రదర్శనకు ఉంచనున్నట్లు కంపెనీ పేర్కొంది. గోవాలో జరగనున్న 2015 ఎడిషన్ ఇండియా బైక్ వీక్‌లో 8 ఇటాలియన్ బైక్‌లను ప్రదర్శనకు ఉంచనుంది.
మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌ను గోవాలోని వగతోర్ ప్రాంతం వద్ద ఫిబ్రవరి 20, 2015 మరియు ఫిబ్రవరి 21, 2015 తేదీలలో నిర్వహించనున్నారు. భారత్‌లోని సెవంటీ ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. మీరు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లయితే, ఈ ఇటాలియన్ ముద్దుగుమ్మలను చూడటం మర్చిపోకండి.



Click it and Unblock the Notifications








