బెంగుళూరులో హ్యోసంగ్ ఆక్విలా జివి250 విడుదల
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హ్యోసంగ్, భారత్‌లో తమ ఎంట్రీ లెవల్ క్రూజర్ బైక్‌ను విడుదల చేసింది. ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ విడుదల చేసిన 'హ్యోసంగ్ ఆక్విలా జివి250' మోటార్‌సైకిల్‌ను తాజాగా బెంగుళూరు మార్కెట్లో విడుదల చేశారు. అంతేకాకుండా, బెంగుళూరులో తమ రెండవ షోరూమ్‌ను కూడా ప్రారంభించారు.
బెంగుళూరు జయానగర్ 9వ బ్లాక్ వద్ద ఈ కొత్త డిఎస్‌కె హ్యోసంగ్ షోరూమ్‌ను గురువారం నాడు ప్రముఖ కన్నడ సినీ నటుడు ప్రజ్వల్ దేవరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో హ్యోసంగ్ మొత్తం ఆరు ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది.
హ్యోసంగ్ ఆక్విలా 250 విషయానికి వస్తే, కంపెనీ గతంలో విడుదల చేసిన ఆక్విలా ప్రో 650 బైక్‌కు దిగువన అదే సిరీస్‌లో తక్కువ ఇంజన్ సామర్థ్యంతో ఈ బైక్‌ను తయారు చేశారు. హ్యోసంగ్ ఆక్విలా జివి250 బైక్ స్పెసిఫికేషన్లు, పెర్ఫామెన్స్, ధర మొదలైన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హ్యోసంగ్ జివి250లో 249సీసీ, 4-స్ట్రోక్, డిఓహెచ్‌సి, 8-వాల్వ్, ఆయిల్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 26.21 బిహెచ్‌పిల శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 21.37 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 5-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

హ్యోసంగ్ ఆక్విలా 250 బైక్ 2282 మి.మీ. పొడవును, 875 మి.మీ వెడల్పును మరియు 1096 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్ బేస్ 1515 మి.మీ. గా ఉంటుంది.

హ్యోసంగ్ ఆక్విలా 250 బైక్‌లో ముందు వైపు హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌ను మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను ఆఫర్ చేస్తున్నారు.

హ్యోసంగ్ ఆక్విలా 250 బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. దీని మొత్తం బరువు 179 కేజీలు.

ఇందులో ముందు వైపు 110/90 16 59S టైరును మరియు వెనుక వైపు 150/80 15 70S టైరును ఆఫర్ చేస్తున్నారు.

హ్యోసంగ్ ఆక్విలా 250 బైక్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ మరియు వెనుక వైపు హైడ్రాలిక్ డబుల్ షాక్ అబ్జార్వర్‌ను ఆఫర్ చేస్తున్నారు.

భారత మార్కెట్లో హ్యోసంగ్ ఆక్విలా 250 బైక్ ధర రూ.2.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. ఇది వైట్, బ్లాక్ రెడ్, బ్లాక్ కలర్లలో లభిస్తుంది.

దేశీయ విపణిలో హ్యోసంగ్ అందిస్తున్న ఇతర మోడళ్లు వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* ఆక్విలా 250 - రూ.2.70 లక్షలు
* జిటి 250ఆర్ - రూ.2.80 లక్షలు
* జిటి 650ఎన్ - రూ.4.04 లక్షలు
* జిటి 650ఆర్ - రూ.4.87 లక్షలు
* ఆక్విలా ప్రో 650 - రూ.5.35 లక్షలు
* ఎస్‌టి 7 - రూ.6.10 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)


Click it and Unblock the Notifications








