సిగ్నేచర్ ఎడిషన్ హ్యోసంగ్ జిటి250ఆర్ ఎల్ఈ విడుదల
డిఎస్‌కె మోటోవీల్స్ ఓ లిమిటెడ్ ఎడిషన్ 250సీసీ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 'హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈ' (Hyosung Signature Edition GT250R LE) అనే పేరుతో కంపెనీ విడుదల చేసిన కొత్త క్వార్టర్ లీటర్ స్పోర్ట్స్ బైక్‌ను పూనేలో జరిగిన ఓ కార్యక్రమంలో డిఎస్‌కె మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి విడుదల చేశారు.
భారత్‌లో తమ ఎక్స్‌క్లూజివ్ ఓనర్స్ క్లబ్ 'హైరైడర్స్' (HYRyders)ను ప్రారంభించి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా, కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కేవలం 50 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్‌క్లూజివిటీ కోసం ఈ మోడల్ ఉత్పత్తిని 50 యూనిట్లకు పరిమితం చేశారు.
హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఈ లిమిటెడ్ ఎడిషన్ హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈ బైక్ రెగ్యులర్ హ్యోసంగ్ జిటి250ఆర్ కన్నా భిన్నంగా ఉంటుంది.

ఈ మోడల్ ఎక్స్‌క్లూజివ్‌గా 'హారికేనే యల్లో' కలర్‌లో లభిస్తుంది. ప్రతి బైక్‌పై సదరు బైక్ యజమాని సంతకం ఉంటుంది. ఇదే ఇందులో ఓ విశిష్టమైన ప్రత్యేకత.

హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈలో 250సీసీ వి-ట్విన్, ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 17.6 బిహెచ్‌పిల శక్తిని, 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 22.07 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈ బైక్ గరిష్టం వేగం గంటకు 140 కిలోమీటర్లు.

డబుల్ డిస్క్ ఫ్రంట్ బ్రేక్స్, ట్విన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్, ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్, అడ్జస్టబల్ రియర్ వంటి ఫీచర్లు ఈ లిమిటెడ్ ఎడిషన్ హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈ బైక్ సొంతం.

హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈ క్వార్టర్ లీటర్ (250సీసీ) ఇంజన్ కలిగిన మోటార్‌సైకిల్ అయినప్పటికీ, దీని విజువల్ లుక్ మాత్రం భారీ మోటార్‌సైకిల్‌ను తలపిస్తుంది.

హ్యోసంగ్ సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ ఎల్ఈ బైక్ ధర రూ.2.97 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది.

అయితే, పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, హ్యోసంగ్ జిటి250ఆర్ ఈ సెగ్మెంట్లో హోండా సిబిఆర్250ఆర్, కవాసకి నిన్జా300 వంటి మోడళ్ల ముందు పోటీగా నిలబడలేదు. మరోవైపు తయారీ నాణ్యత విషయంలోను కొనుగోలుదారుల్లో హ్యోసంగ్ జిటి250ఆర్ మోడల్‌పై అసంతృప్తి ఉంది.

ఈ సందర్భంగా డిఎస్‌కె మోటోవీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి మాట్లాడుతూ.. కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, తాము ఈ కొత్త సిగ్నేచర్ ఎడిషన్ జిటి250ఆర్ మోడల్‌ను విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు.


Click it and Unblock the Notifications








