హ్యోసంగ్ నుంచి 125సీసీ, 150సీసీ బైక్‌లు వస్తున్నాయ్..!

By Ravi

భారత మార్కెట్లో స్పోర్ట్స్, లీజర్, సూపర్ బైక్ సెగ్మెంట్లో వాహనాలను అందిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ 'హ్యోసంగ్' ఇకపై అర్బన్ కమ్యూటర్ సెగ్మంట్లోనూ బైక్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రీమియం బైక్ మేకర్‌గా ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యోసంగ్ ఇప్పుడు మాస్ బైక్ సెగ్మెంట్‌పై కన్నేసింది. ఇందులో భాగంగానే, 125సీసీ, 150సీసీ సెగ్మెంట్లలో బైక్‌లను ఆఫర్ చేయాలని హ్యోసంగ్ యోచిస్తోంది.

పూనేకు చెందిన డిఎస్‌కే మోటోవీల్స్‌తో చేతులు కలిపి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యోసంగ్, ఇటీవలే విడుదల చేసిన 250సీసీ ఇంజన్ సామర్థ్యంతో కూడిన స్పోర్ట్స్ బైక్ 'హ్యోసంగ్ జిటి250ఆర్'కు దేశీయ విపణి నుంచి మంచి స్పందన లభించడంతో, ఈ బైక్ కన్నా తక్కువ ధరతో కూడిన బైక్‌లను అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

Hyosung 125cc Bike

హ్యోసంగ్ ఇదివరకు తమ బైక్‌లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో విదేశాలను దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించేది. అయితే, డిఎస్‌కె మోటోవీల్స్‌కు పూనేకు సమీపంలోని వాయ్ వద్ద ఉన్న అసెంబ్లింగ్ కేంద్రంలో 250సీసీ నుంటి 650సీసీ వరకూ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్‌లను అసెంబ్లింగ్ చేయగల సామర్థ్యం ఉంది. ఈ ప్లాంటులో ప్రతినెలా 250 మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయవచ్చని డిఎస్‌కే మోటోవీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష్ కులకర్ణి తెలిపారు.

అంతేకాకుండా, మహారాష్ట్రలో రూ.300-350 కోట్ల పెట్టుబడితో ఓ కొత్త ప్లాంటును నిర్మిస్తున్నామని, ఇందులో ఎక్కువ భాగం యంత్రాలనే ఉపయోగిస్తామని, రానున్న ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ ప్లాంటు నిర్మాణం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో డిఎస్‌కె హ్యోసంగ్ ఈ ప్లాంటులో తమ బైక్‌లను అసెంబ్లింగ్ చేయటం, ఇందులో ఎక్కువ భాగం భారత మార్కెట్లో లభ్యమయ్యే విడిభాగాలనే ఉపయోగించటం వలన సరమైన ధరకే ఈ బైక్‌లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, April 29, 2013, 10:33 [IST]
English summary
South Korean sports bike manufacturer Hyosung and its Pune partner DSK Motowheels is mulling to launch 125-150cc segment bikes in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+