బెనెల్లీ బైక్స్‌ను ఇండియాకు తీసుకురానున్న డిఎస్‌కే మోటోవీల్స్
ఇటలీకి చెందిన మరో లగ్జరీ టూవీలర్ బ్రాండ్ భారత్‌కు రాబోతోంది. ప్రముఖ ఇటాలియన్ స్పోర్ట్స్ బైక్స్ తయారీ కంపెనీ 'బెనెల్లీ' (Benelli), పూనేకి చెందిన డిఎస్‌కె మోటోవీల్స్ ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 17న బెనెల్లీ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. డిఎస్‌కే మోటోవీల్స్ ఇప్పటికే హ్యోసంగ్ మోటార్‌సైకిళ్లను భారత్‌లో అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తోన్న సంగతి తెలిసినదే.
బెనెల్లీ అందిస్తున్న స్పోర్ట్స్ బైక్‌లకు గ్లోబల్ మార్కెట్లలో మంచి క్రేజ్ ఉంది. ఈ బ్రాండ్ నుంచి లభిస్తున్న స్టార్టింగ్ బైక్ బెనెల్లీ బిఎన్302 స్ట్రీట్ ఫైటర్ (ఈ ఫొటోలో కనిపిస్తున్న బైక్). ఒకే గ్రూప్ నుంచి రెండు వేర్వేరు లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లు భారత్‌లో లభ్యం కానున్న నేపథ్యంలో, ఈ ఇరు బ్రాండ్‌ల మధ్య పోటీ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణలు భావిస్తున్నారు.

అయితే, డిఎస్‌కే గ్రూప్ మాత్రం అలాంటిది ఏమీ ఉండదని, ఈ రెండు బ్రాండ్‌లు తయారు చేసే ఉత్పత్తులు వేర్వేరు విభాగాల్లో ఉంటాయని, వేర్వేరు ధరల్లో లభ్యమవుతాయని, ఫలితంగా వీటి మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉండని చెబుతోంది. భారత్‌లో హ్యోసంగ్‌కు ఎలాగైతే ప్రత్యేకమైన షోరూమ్‌లు ఉన్నాయో, బెనెల్లీకి కూడా ఇండివిడ్యువల్ షోరూమ్‌లను ఏర్పాటు చేస్తామని హ్యోసంగ్ తెలిపింది.
బెనెల్లీ ప్రస్తుత ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ప్రారంభ ఉత్పత్తి ఓ పారలల్-ట్విన్ 300సీసీ ఇంజన్ కలిగిన నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్. ఈ బ్రాండ్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో 1130సీసీ వరకు ఇంజన్ సామర్థ్యం కలిగిన ఉత్పత్తులు ఉన్నాయి. ఈ మొత్తం ఉత్పత్తుల శ్రేణిని డిఎస్‌కే గ్రూప్ ఇండియాకు తీసుకువచ్చే ఆస్కారం ఉంది. అయితే, వీటిని సిబియూ (కంప్లీట్ల్ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుంటారా లేక సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








