ఎక్సైజ్ డ్యూటీ కట్: హోండా, హీరో ఉత్పత్తుల ధరలు కట్
కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2014-15లో ద్విచక్ర వాహనాలపై కూడా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో, ఆయా ఉత్పత్తుల ధరలను కూడా కొంత మేర తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇప్పటికే పలు ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
తమ టూవీలర్ల ధరలను రూ.1,600 నుంచి రూ.7,600 వరకు తగ్గిస్తున్నామని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రకటించగా, తమ ద్విచక్ర వాహనాల ధరలను రూ.4,500 వరకూ తగ్గిస్తున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది.
ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో చిన్న కార్లు, మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎక్సైజ్ సుంకం తగ్గింపు వలన లభించే పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకే అందిస్తామని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.



Click it and Unblock the Notifications








