ఫెలైన్ వన్.. ధర వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్ది!

By Ravi

ఈ ఫొటోలలో కనిపిస్తున్న బైక్ ఆషామాషీ బైక్ కాదు. దీని ధర వింటే కళ్లు తిరిగటం ఖాయం. స్విట్జర్లాండ్‌కి చెందిన ఫెలైన్ మోటార్‌సైకిల్ కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసింది. దీని పేరు 'ఫెలైన్ వన్' (Feline One). ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లలో ఒకటి.

ఫెలైన్ మోటార్‌సైకిల్ ధర జస్ట్ రూ.1.75 కోట్లు మాత్రమే. ఫెలైన్ వన్ బైకులను ఒకే ఒక్కసారి.. అది కూడా 50 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు ఫెలైన్ మోటార్‌‌సైకిల్స్ పేర్కొంది. ఈ స్టన్నింగ్ ఫ్యూచరిస్టిక్ మోటార్‌సైకిల్ వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి రానుంది.

మరి ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్ అంత అధిక ధర పలకడానికి ఇందులో ఉన్న విశిష్టతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

తర్వాతి స్లైడ్‌లలో ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

ఫెలైన్ వన్ ప్రాజెక్టును ప్రముఖ డిజైనర్ యోకౌబా గల్లే డిజైన్ చేశాడు. ఇతను ఇప్పటికే అనేక కాన్సెప్ట్ మోటార్‌సైకిళ్లను డిజైన్ చేసినప్పటికీ, ఫెలైన్ వన్ మాత్రమే ముందుగా ఉత్పత్తి దశకు చేరుకోనుంది.

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

ఇదివరకు చెప్పుకున్నట్లు గానే ఫెలైన్ వన్ బైక్ విషయంలో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం ఫెలైన్ మోటార్‌సైకిల్ కేవలం 50 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని, ఆ తర్వాత ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేస్తామని కంపెనీ పేర్కొంది.

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్‌లో 801సీసీ, త్రీ-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

ఈ బైక్ షాషీని ఏరోస్పేస్ అల్యూమినియం (విమానాల తయారీలో ఉపయోగించే ధృడమైన మరియు తేలికైన అల్యూమినియం)తో తయారు చేశారు. ఇది కేవలం 155 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

ఇంకా బైక్‌లోని ఇతర భాగాలు, బాడీ పార్ట్‌ని కార్బన్ ఫైబర్, టైటానియం పదార్థాలతో తయారు చేశారు. వీల్ రిమ్స్, స్వింగ్ ఆర్మ్, ఫెయిరింగ్స్, ఫ్రంట్ ఫోర్క్క్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు.

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

ఫెలైన్ వన్ ఒక హై-టెక్ డీలక్స్ మోటార్‌సైకిల్ అని ఈ బైక్‌ను డిజైన్ చేసిన యాకౌబ్ గల్లె తెలిపారు.

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

దాదాపు 10 ఏళ్లుగా సేకరించిన డేటాను ఆధారంగా చేసుకొని ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేసినట్లు యాకౌబ్ తెలిపారు

ఫెలైన్ వన్ మోటార్‌సైకిల్

ఫెలైన్ మోటార్‌సైకిల్ 2016 ప్రథమార్థం నాటికి మార్కెట్లోకి రానుంది. మరి ఈ బైక్‌ను సొంతం చేసుకోనున్న ఆ లక్కీ పర్సన్స్ ఎవరో వేచి చూడాల్సిందే మరి.

More from DriveSpark

Article Published On: Saturday, February 21, 2015, 9:53 [IST]
English summary
Feline Motorcycles has launched their very first product in limited numbers. They have christened their motorcycle as the ‘Feline One'. This unique looking motorcycle will be available across the world by 2016.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+