గ్రేప్ జి-12: ఓ ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ సైకిల్

By Ravi

మనకి ఎలక్ట్రిక్ సైకిళ్లు కొత్తేమీ కాదు. ఇప్పటికే మనం పలు రకాల ఎలక్ట్రిక్ సైకిళ్లను చూశాం. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే ఎలక్ట్రిక్ సైకిల్ మాత్రం కాస్తంత విశిష్టమైనది, విభిన్నమైనది. దీని పేరు గ్రేప్ జి-12 (Greyp G-12), గ్రేప్ అనే కంపెనీ ఈ ఎలక్ట్రిస్ సైకిల్‌ను తయారు చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే కంపెనీ రిమ్యాక్ ఆటోమొబిలి కాన్సెప్ట్_వన్ అనే హై పెర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ కారును కూడా తయారు చేస్తుంది. అన్ని ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే జి-12 ఎలక్ట్రిక్ సైకిల్ కూడా భిన్న మోడళ్లలో హైపెర్ఫామెన్స్ బైక్ నుంచి గ్రీన్ మోపెడ్ వరకు అలాగే సిటీ బైక్ నుంచి మౌంటైన్ బైక్ వరకూ వివిధ ఆప్షన్లతో రూపుదిద్దుకుంది.

ఇవేకాకుండా, ఈ గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్‌లో మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు అవేంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి. చివరి స్లైడ్‌లో ఈ సైకిల్ వీడియోను వీక్షించడం మర్చిపోకండి.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

జి-12 ఎలక్ట్రిక్ సైకిల్ 12 కి.వా. (16 హెచ్‌పి) మోటార్‌ సాయంతో నడుస్తుంది. ఈ మోటార్ వీల్ హబ్‌లో అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 1.3 కి.వా. లిథియం-నానోఫాస్పేట్ బ్యాటరీ సెల్స్ సాయంతో నడుస్తుంది. గ్రేప్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ తరహా బ్యాటరీ అత్యంత అధునాత హై పెర్ఫామెన్స్ సెల్స్‌తో కూడిన బ్యాటరీ.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

ఈ బ్యాటరీలు కేవలం 80 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జ్ అవుతాయి. వీటిని గృహ వినియోగానికి ఉపయోగించే సాధారణ 220 వోల్ట్ అవుట్‌లెట్ సాయంతో ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు కేవలం గంటకు 1.3 కి.వా. విద్యుత్ మాత్రమే ఛార్జ్ అవుతుంది.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

జి-12 పెడల్ సాయంతో కూడా నడుస్తుంది. మీకు అవసరమైనప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌ను ఆపి వేసి పెడల్ సాయంతో సాధారణ సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ పోవచ్చు. ఇలా తొక్కుతున్నప్పుడు, బ్రేక్ వేసినప్పుడు ఇందులోని బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

బ్రేక్స్ విషయానికి వస్తే, ముందు వైపు డ్యూయెల్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్,స్, వెనుక వైపు సింగిల్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇందులోని రీజనరేటివ్ సిస్టమే బైక్‌ను స్లో చేస్తుంది కాబట్టి, బ్రేక్‌లను ఎక్కువగా ఉపయోగించే అవసరం ఉండదని గ్రేప్ చెబుతోంది.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తో ఇది గరిష్టంగా గంటకు 65 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సింగిల్ ఛార్జ్‌పై 120 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. దీనికి పెడల్ పవర్‌ను జోడించినట్లయితే, ఈ రేంజ్ మరింత విస్తృతంగా పెరిగే ఆస్కారం ఉంది.

ఇది 3 రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది

ఇది 3 రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది

స్ట్రీట్: సిటీలో ట్రావెల్ చేసేందుకు ఈ మోడ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. కేవలం 250 వాట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుంది.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

పవర్ మోడ్: దీనిని స్పీడ్ మోడ్ అని కూడా అంటారు. ఈ మోడ్‌లో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

ఈకో మోడ్: ఈ మోడ్‌లో ఇటు పెర్ఫామెన్స్‌ను అటు రీజనరేషన్‌ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

జి-12 బైక్‌లో విశిష్టమైన ఫీచర్ ఏంటంటే, ఇది ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో లభిస్తుంది. ఈ ఫీచర్ కేవలం బైక్‌ను అన్‌లాక్ చేయడానికే కాకుండా విభిన్న వేలిముద్రలను ఉపయోగించి, నిర్ధిష్ట రైడింగ్ మోడ్స్‌ను ఎంచుకునేందుకు కూడా సహకరిస్తుంది. ఉదాహరణకు బ్రొటన వేలు అన్‌లాక్‌కు, చూపుడు వేలు స్పీడ్ మోడ్‌కు, చిటికిన వేలు ఈకో మోడ్‌కు ఆ విధంగా సెట్ చేసుకోచ్చు.

గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్

ప్రతి యూజర్ 5 వేలిముద్రలను స్టోర్ చేసుకోవచ్చు. ఇలా 50 మంది యూజర్లు తమ వేలిముద్రలను స్టోర్ చేసుకోవచ్చు. ఈ బైక్ యజమాని స్పీడ్ లిమిట్, రైడింగ్ టైమ్ వంటి యూజర్ రైట్స్‌ను కూడా నియంత్రించవచ్చ.

ఈ బైక్ యాక్షన్ వీడియోను తిలకించండి.

ధర

ధర

ఇన్ని విశిష్ట ఫీచర్లు కలిగిన గ్రేప్ జి-12 ఎలక్ట్రిక్ సైకిల్ ధర 7900 డాలర్లు. మన దేశ కరెన్సీలో సుమారు రూ.5 లక్షలకు పైమాటే. మరింత సమాచారం కోసం http://www.greyp-bikes.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Friday, September 13, 2013, 11:11 [IST]
English summary
Electric bicycles are not new, but every once in awhile there comes out a product that manages to catch our attention. The G-12, from a company called Greyp, is one such electric bike. As with all electric vehicles G-12 comes with different modes which helps it transmission from a relatively high performance bike to a green moped for the city to a mountain bike. G-12 also features some impressive electronic features. Here is a quick look, along with a demo video.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+