హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి చవక బైక్‌లు వస్తున్నాయోచ్...!

By Ravi

ఇండియన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధరల రేంజ్‌లో అమెరికన్ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు లభిస్తే, మీరు దేనిని కొనుగోలు చేస్తారు..? అవును త్వరలోనే హ్యార్లీ డేవిడ్‌సన్ చవక ధరకే తమ ప్రీమయం బైక్‌లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. 250సీసీ రేంజ్ నుంచి 750సీసీ రేంజ్‌లో (800సీసీ-1000సీసీకి దిగువన) ఇంజన్ సామర్థ్యం కలిగిన కొత్త లగ్జరీ మోటార్‌సైకిళ్లను హ్యార్లీ డేవిడ్‌సన్ విడుదల చేయనుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ప్రత్యేకించి ఈ బైక్‌లను పూర్తిస్థాయిలో భారత్‌లోనే తయారు చేయనున్నది. అంతేకాకుండా, ఇక్కడ మార్కెట్లో తయారు చేసిన మోటార్‌సైకిళ్లను యూరప్, నైరుతి ఆసియా దేశాలకు కూడా ఎగుమతి చేయాలని కూడా కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న ఈఐసిఎమ్ఏ మోటార్ షోలో హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750, స్ట్రీట్ 500 మోడల్ బైక్‌లను ఆవిష్కరించింది.


ఇవి హ్యార్లీ డేవిడ్‌సన్ చరిత్రలో 14 ఏళ్ల తర్వాత పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయబడినవి. ఈ రెండు బైక్‌లను వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్‌లోనే తయారుచేయడం ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఇవి హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి లభ్యం కానున్న అతి తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్‌లు కావటం కూడా మరో విశేషం. వీటితో పాటుగా మరో 250సీసీ ఇంజన్ కలిగిన బైక్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి.

భారతదేశంతో పాటుగా సమీప దేశాల్లో కూడా హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో మాథ్యూ లావటిక్ అన్నారు. అందుకే భారత మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా, సమీప దేశాలకు ఎగుమతులు చేసే లక్ష్యంగా స్ట్రీట్ సిరీస్ బైక్‌లను భారత్‌లో ఉత్పత్తి చేయనున్నామని ఆయన వివరించారు. హర్యానాలోని బవాల్ ప్లాంట్‌లో ఈ బైక్‌లను ఉత్పత్తి చేయనున్నారు.

HD Street 750

ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి భారత మార్కెట్లో లభిస్తున్న అతి చవక బైక్ ‘సూపర్ లో'. దేశీయ విపణిలో దీని ధర రూ.5.6 లక్షలు (ఎక్స్ షోరూమ్-ఢిల్లీ)గా ఉంది. ఈ నేపథ్యంలో, దీని కన్నా తక్కువ ధరకే ‘స్ట్రీట్' సిరీస్ బైక్‌ల ధరలు ఉంటాయని తెలుస్తోంది. స్ట్రీట్ 500 ధరలు రూ.3.8 లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్‌లోను అలాగే స్ట్రీట్ 700 ధరలు రూ.4.5 లక్షల నుంచి రూ.4.8 లక్షల రేంజ్‌లో ఉంటాయని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, November 8, 2013, 12:21 [IST]
English summary
Harley Davidson Street 750 and Street 500, the ‘Dark Custom' cruiser bikes from the American motorcycle marquee were unveiled earlier this week at EICMA in Milan, Italy. These bikes have been developed specifically keeping in mind, the high volume Indian two wheeler market. As such, they will be manufactured in India as well, making the bikes easy to afford.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+