మూడు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్
అమెరికాకు చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్, గురువారం నాడు భారత మార్కెట్లో మూడు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. సివిఓ లిమిటెడ్, స్ట్రీల్ గ్లైడ్ స్పెషల్ మరియు బ్రేకవుట్ అనే మూడు కొత్త మోటార్‌సైకిళ్లను హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా ఆక్టోబర్ 30, 2014వ తేదీన దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:
ధరలు:
* హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రేకవుట్ - రూ.16.28 లక్షలు
* హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్ - రూ.29.70 లక్షలు
* హ్యార్లీ డేవిడ్‌సన్ సివిఓ లిమిటెడ్ - రూ.49.24 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రేకవుట్
హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రేకవుట్ మోడల్ కంపెనీ అందిస్తున్న ఫ్యాట్ బాయ్, ఫ్యాట్ బాయ్ స్పెషల్, హెరిటేజే సాఫ్టైల్ క్లాసిక్ వంటి సాఫ్టైల్ ఫ్యామిలీకి చెందినది. ఇందులో 1690సీసీ, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్
ఈ మోటార్‌సైకిల్‌లో 1690సీసీ, ఎయిర్-కూల్డ్, ట్విన్ క్యామ్ 103 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 138 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6.5జిటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది బ్లూటూత్ మరియు యూఎస్‌బి కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన రెఫ్లెక్స్ లింక్డ్ బ్రేక్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ సివిఓ
హ్యార్లీ డేవిడ్‌సన్ సివిఓ (కస్టమ్ వెహికల్ ఆపరేషన్స్) లిమిటెడ్ మోడల్‌ను కంపెనీ ప్రత్యేకంగా తయారు కస్టమైజ్ చేసింది. ఇందులో 1801సీసీ, ట్విన్-కూల్డ్, ట్విన్ క్యామ్ 110 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 156 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ చాలా పరిమిత సంఖ్యలో లభ్యం కానుంది. ఈ ప్రతి మోడల్‌ను కూడా పూర్తిగా చేతుల్లోనే తయారు చేయనున్నారు.


Click it and Unblock the Notifications








