హెడ్‌లైట్ సమస్య: 100 యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 బైక్‌ల రీకాల్!
జపానకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ యమహా భారత మార్కెట్లో విక్రయించిన వైజెడ్ఎఫ్-ఆర్1 సూపర్‌బైక్‌లో హెడ్‌లైట్ల సమస్య కారణంగా 100 యూనిట్లను వెనక్కు పిలిపిస్తున్న (రీకాల్) ప్రకటించింది. నాణ్యత విషయంలో తాము ప్రపంచం వ్యాప్తంగా అనుసరించే విధానంలో భాగంగా ఈ రీకాల్ చేస్తున్నామని, గడచిన 3-4 ఏళ్లలో భారతలో విక్రయించిన యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 బైక్‌లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.
తమ మాతృ సంస్థ యమహా మోటార్ కంపెనీ, జపాన్ వైజెడ్ఎఫ్-ఆర్1 మోటార్‌సైకిళ్లలో ఈ సమస్యను గుర్తించిందని, హెడ్‌లైట్ లీడ్ కపులర్ ఓవర్‌హీట్‌కు గురై కరిగిపోవటం వలన హెడ్‌లైట్లలో సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే వీటిని రీకాల్ చేస్తున్నామని యమహా మోటార్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
రీకాల్ చేయబడిన మోటార్‌సైకిళ్లలో ఈ హెడ్‌లైట్ సబ్-లీడ్‌ను వీలైనంత త్వరగా రీప్లేస్ చేయాలని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం యమహా ఓ ఫ్యాక్టరీ మోడిఫికేషన్ క్యాంపైన్‌ను ప్రారంభించనుందని, ఇందులో భాగంగా రీకాల్‌కు వర్తించే మోటార్‌సైకిళ్లలో లోపపూరితమైన హెడ్‌లైట్ సబ్-లీడ్ స్థానంలో మోడిఫైడ్ హెడ్‌లైట్ సబ్-లీడ్‌ను రీప్లేస్ చేయటం జరుగుతుందని యమహా వివరించింది.



Click it and Unblock the Notifications








