హీరో గ్లామర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్!
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అందిస్తున్న 'హీరో గ్లామర్' (Hero Glamour) మోటార్‌సైకిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌ని నియమించుకుంది. హీరో మోటోకార్ప్ తమ వాహనాలను ప్రమోట్ చేసుకోవటం కోసం కంపెనీ రీజనల్ సూపర్‌స్టార్‌లను ఎంచుకోవటం ఇదే మొదటిసారి. ఈ మేరకు ఓ కొత్త టివిసిని కూడా కంపెనీ విడుదల చేసింది.
హీరో మోటోకార్ప్ ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు గాను జాతీయంగాను అలాగే అంతర్జాతీయంగాను పలువును ప్రముఖులను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటోంది. అలియా భట్, సర్దార్ సింగ్, టైగర్ వుడ్స్ కూడా ఈ బ్రాండ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే. మరి అల్లు అర్జున్‌పై చిత్రీకరించిన ఆ టెలివిజన్ కమర్షియల్‌ను మనం కూడా చూసేద్దాం రండి.
హీరో గ్లామర్ ఇంజన్, ట్రాన్సిమిషన్:
కొత్త హీరో గ్లామర్ బైక్‌లో 124.7సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 10.35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
హీరో గ్లామర్ ఫీచర్లు:
కొత్త అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఈ బైక్‌లో చూడొచ్చు. ఇందులో స్పీడోమీటర్ అనలాగ్ కాగా, ఓడోమీటర్, ఫ్యూయెల్ గేజ్ మరియు ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ మీటర్లు డిజిటల్‌గా ఉంటాయి. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు 5-స్టెప్ అడ్జస్టబల్ షాక్ అబ్జార్వర్‌లను ఆఫర్ చేస్తున్నారు. ఇకపోతే, ముందు వైపు ఆప్షనల్ 240 మి.మీ. డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు ఆప్షనల్ 130 డిస్క్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్స్ 130 మి.మీ. డయాను కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications








