ఆటో ఎక్స్‌పో 2014: హీరో హస్టర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ
దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఓ సరికొత్త కాన్సెప్ట్ బైక్‌ను ఇండియన్లకు పరిచయం చేసింది. కంపెనీ అభివృద్ధి చేసిన 620సీసీ మోడ్రన్ స్పోర్ట్స్ బైక్ 'హీరో హస్టర్'ను గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌లో కంపెనీ ఆవిష్కరించింది.
షార్ప్ డిజైన్, స్పోర్టీ యల్లో కలర్ ఫ్రేమ్ కలిగి ఉండే ఈ హీరో హస్టర్ బైక్‌లో ఉపయోగించిన 620సీసీ వాటర్-కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజన్ గరిష్టంగా 9600 ఆర్‌పిఎమ్ వద్ద 80 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హీరో హస్టర్ బైక్ ప్రస్తుతం కాన్సెప్ట్ దశలోనే ఉంది, త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది.
హీరో మోటోకార్ప్ తమ హస్టర్ స్పోర్ట్స్ బైక్ కాన్సెప్ట్‌ను ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఇండియాలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications








