హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో విడుదల; ధర రూ.50,500
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సరికొత్త 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో' (Hero HF Deluxe Eco) బడ్జెట్ మోటార్‌సైకిల్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది.
గుర్గావ్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో హోండా ఈ కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈకో గ్రీన్ పెయింట్ స్కీమ్‌లో ఉండే ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.50,500 లుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో మోటార్‌సైకిల్‌లో 97.2సీసీ, ఫోర్-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.7 బిహెచ్‌పిల శక్తిని, 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
ఈ బైక్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్ మరియు వెనుక వైపు స్వింగ్ ఆర్మ్ 2 స్టెప్ అడ్జస్టబల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్‌తో లభిస్తుంది. ఇందులో డ్రమ్ బ్రేక్స్ మాత్రమే ఉన్నాయి. ఎయిర్ ఫాయిల్స్, రీస్టయిల్డ్ మిర్రర్స్, లో రోలింగ్ ఫ్రిక్షన్ టైర్స్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, క్లియర్ లెన్స్ ఇండికేటర్స్, ట్రాపేజోయిడల్ మల్టీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్, బికినీ ఫెయిరింగ్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications








