పెద్ద ఇంజన్‌తో రానున్న హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్

By Ravi

జపాన్ భాగస్వామి హోండా మోటార్‌సైకిల్ నుంచి విడిపోయిన తర్వాత, హీరో మోటోకార్ప్ తొలిసారిగా ప్రవేశపెట్టిన ఉత్పత్తులలో హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్ కూడా ఒకటి. ఇటు ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం అటు సిటీ రైడింగ్ ప్రయోజనాల కోసం అనువుగా ఉండేలా డిజైన్ చేసిన ఈ డ్యూయెల్ పర్పస్ మోటార్‌సైకిల్ మార్కెట్లో ఆశించిన సక్సెస్‌ను సాధించలేకపోయింది. దీంతో కంపెనీ 2012లో ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది.

అందుకే, పెద్ద ఇంజన్‌తో కూడిన పెర్ఫామెన్స్ వెర్షన్ హీరో ఇంపల్స్‌ను ప్రవేశపెట్టేందుకు హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 2011లో హీరో మోటాకార్ప్ తమ ఇంపల్స్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇదివరకటి హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్‌లో 150 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 13.8 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

మరిన్ని వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్

హీరో మోటోకార్ప్ తమ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా, సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు హోండా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఇంజన్లు తయారు చేస్తూ వచ్చిన హీరో, ఇకపై ఇతర సాంకేతిక సంస్థలతో కలిసి సరికొత్త ఇంజన్లను అభివృద్ధి చేయనుంది.

హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్

అందులో కొత్త మెరుగైన 100సీసీ రేంజ్ ఇంజన్లతో పాటుగా 250సీసీ ఇంజన్లు కూడా ఉండనున్నాయి. అందులో మరింత మెరుగైన ఇంజన్‌ను ఒకదానిని కొత్త ఇంపల్స్ బైక్‌లో ఉపయోగించి మార్కెట్లో ప్రీమియం బైక్‌గా పునఃప్రవేశపెట్టనున్నారు.

హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్

అయితే, హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త ఉత్పత్తులను పొందాలంటే మరికొద్ది నెలలు వేచి ఉండాల్సిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో హోండా ఈ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించే అవకాశం ఉంది.

హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్

హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా డిమాండ్ ఉండే ప్రీమియం బైక్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అందులో కొత్త ఇంపల్స్ కూడా ఉంటుందని వివరించారు.

హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్

పెద్దతో ఇంజన్‌తో అభివృద్ధి చేస్తున్న కొత్త హీరో ఇంపల్స్‌ను 2014లో పునఃప్రవేశపెడతామని, పవర్‌ఫుల్ ఇంజన్‌తో పాటుగా ఈ బైక్‌ను కూడా రీడిజైన్ చేస్తామని ఆయన చెప్పారు. ఈ బైక్ రీడిజైనింగ్ పనిలో అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబిఆర్) కీలక పాత్ర పోషిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2013, 12:13 [IST]
English summary
The all new Impulse will then be launched not just in India, but also in Latin America where customers have a thirst for semi-off roaders. Besides the larger engine, the new Impulse will also be available with the old 149.2cc engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+