పెరూ దేశంలో కాలు మోపిన హీరో మోటోకార్ప్

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్, తమ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా తాజాగా పెరూ దేశంలోకి ప్రవేశించింది. స్పానిష్ వెర్షన్ 'మనలోనే హీరో' (హమ్ మే హై హీరో) ప్రకటన క్యాంపైన్‌తో హీరో మోటోకార్ప్ లాటిన్ అమెరికా దేశాల్లో తమ బ్రాండ్‌ను నిర్మించుకునే ప్రయత్నం చేపట్టింది.

పెరూ దేశంలో హీరో మోటోకార్ప్ ఉత్పత్తులు మోటోకార్ప్ ఎస్ఏసి ద్వారా విక్రయం కానున్నాయి. మోటోకార్ప్ ఎన్ఏసి హీరో మోటోకార్ప్‌కు ఏకైక అధీకృత పంపిణీదారుగా వ్యవహరించనుంది. అక్కడి మార్కెట్లో తమ ఉత్పత్తులు సరసమైన ధరతో, ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించగలవని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Hero MotoCorp

దక్షిణ అమెరికా దేశాల్లో హీరో మోటోకార్ప్ విక్రయిస్తున్న ఉత్పత్తులలో ప్యాషన్ ప్రో, గ్లామర్, హంక్, థ్రిల్లర్, కరిజ్మా జెడ్ఎమ్ఆఱ్, కరిజ్మా ఆర్ మోటార్‌సైకిళ్లతో పాటుగా ప్లెజర్ స్కూటర్‌లు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్న 85 అవుట్‌లెట్ల ద్వారా ఈ ఉత్పత్తులు విక్రయం కానున్నాయి. హీరో మోటోకార్ప్ పెరూ దేశంలో కాకుండా, కొలంబియా, గౌటెమాలా, హోండ్యూరాస్, ఎల్ సాల్వడార్ దేశాల్లో కూడా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

హీరో మోటోకార్ప్ 2020 నాటికి రూ.60,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా, రానున్న 6 నెలల్లో 12 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావటంతో పాటుగా ప్రపంచం వ్యాప్తంగా 50 కొత్త మార్కెట్లోలోకి ప్రవేశించడం మరియు 20 కొత్త ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు కంపెనీ యోచిస్తోంది. అలాగే, 2014 నాటికి మూడు ఖండాలలో 6 అసెంబ్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని గతంలో ముంజాల్ వెల్లడించారు.

More from DriveSpark

Article Published On: Friday, August 23, 2013, 14:49 [IST]
English summary
Hero MotoCorp continues on with its aggressive global expansion with Peru becoming the latest country where the company's motorcycles and scooters will be sold. India's largest two wheeler company will build its brand in the Latin American country with the Spanish version of the 'Hum Main Hai Hero' ad campaign.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+